వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొన్ని రాష్ట్రాల‌కే ఈ బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు కాదు; తెలంగాణాకు అన్యాయం: ఎమ్మెల్సీ క‌విత‌

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కొన్ని రాష్ట్రాల‌కే పనికొస్తుందని, అన్ని రాష్ట్రాలకు కాదని, ఈసారి బడ్జెట్ లో కూడా తెలంగాణాకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ క‌విత‌ అసహనం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు, వేతన జీవులకు ఊరట కలిగించే బడ్జెట్ అని కేంద్రం చెబుతుంటే, ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రయోజనాన్ని చేకూర్చే బడ్జెట్ అని బడ్జెట్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర బడ్జెట్ పై ఎమ్మెల్సీ కవిత అసహనం

కేంద్ర బడ్జెట్ పై ఎమ్మెల్సీ కవిత అసహనం


తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కెసిఆర్ కుమార్తె కవిత కేంద్ర బడ్జెట్ పై మాట్లాడుతూ ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కొన్ని రాష్ట్రాలకు చెందిన బడ్జెట్ లా ఉందని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు బడ్జెట్లో ఎటువంటి మేలు జరగలేదని, గత రెండు దఫాలుగా తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయలేదని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం ఎంతగా విఫలమైందో చెప్పడానికి ఈరోజు ప్రకటించిన బడ్జెట్ ఒక ఉదాహరణ అని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు.

బడ్జెట్ లో బీజేపీ పాలిత రాష్ట్రాలకే లబ్ది

బడ్జెట్ లో బీజేపీ పాలిత రాష్ట్రాలకే లబ్ది

ఈరోజు బడ్జెట్లో పది లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కల్పిస్తారని ఆశించమని, కానీ ఏడు లక్షల వరకే ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చారని కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు మంచి జీతాలు ఇస్తున్నామని పేర్కొన్న కవిత, ప్రస్తుతం కేంద్ర మంత్రి ప్రకటించిన రాయితీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఉపయోగపడేది కాదని పేర్కొన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా కేంద్రం డెవలప్మెంట్ ప్రాజెక్టులను ప్రకటించిందని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలంగాణా ప్రాజెక్ట్ ల మాటేమిటి?

తెలంగాణా ప్రాజెక్ట్ ల మాటేమిటి?

తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ప్రాజెక్టులను ప్రకటించలేదని, కనీసం తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టులలో దేనికి జాతీయ హోదా ఇవ్వలేదని ఎమ్మెల్సీ కవిత ఆసనం వ్యక్తం చేశారు. బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం పదివేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారని, అయితే ఎటువంటి మౌలిక సదుపాయాలను, ఎక్కడెక్కడ కల్పిస్తున్నారో వివరాలు చెప్పలేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రెండేళ్లుగా చూస్తున్నామని తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదని మండిపడిన కవిత, 197 నర్సింగ్ కాలేజీలను ప్రకటించారని ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు.

కాళేశ్వరం, మిషన్ భగీరథ పరిస్థితి ఏమిటి?

కాళేశ్వరం, మిషన్ భగీరథ పరిస్థితి ఏమిటి?

ఇక తెలంగాణా వైద్య కళాశాలలను కూడా తామే నిర్మించుకుంటున్నామని కవిత చెప్పారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 5300 కోట్ల రూపాయలు ఇచ్చారని, మరి కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి అని, మిషన్ భగీరథ మాటేమిటని ప్రశ్నించారు . నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు.

తెలంగాణా పెండింగ్ నిధుల సంగతేమిటి?

తెలంగాణా పెండింగ్ నిధుల సంగతేమిటి?

తెలంగాణకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సుమారు వెయ్యి కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం తమకు రుణపడి ఉందని, ఆ బాకీలు తమకు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ నేడు ప్రకటించిన బడ్జెట్ తెలంగాణా రాష్ట్రానికి మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చలేదని, కేవలం ఈ బడ్జెట్ బీజేపీ పాలిత రాష్ట్రాల బడ్జెట్ మాదిరిగా ఉందని అసహనం వ్యక్తం చేశారు.

తెలంగాణాలో మరో కొత్త చట్టం.. ముసాయిదా బిల్లు సిద్ధం; అసెంబ్లీలో ఎప్పుడంటే!!తెలంగాణాలో మరో కొత్త చట్టం.. ముసాయిదా బిల్లు సిద్ధం; అసెంబ్లీలో ఎప్పుడంటే!!

English summary
MLC Kavitha expressed her impatience that the budget presented by Union Minister Nirmala Sitharaman is for some states and not for all states and Telangana has been treated unfairly in this budget as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X