నా జోలికొస్తే బాగోదు, కేటీఆర్ పై కవిత ఎటాక్ - కేసీఆర్ ను కాపాడుకుంటా..!!

ఎమ్మెల్సీ కవిత తన స్వరం మరింత పెంచారు. పరోక్షంగా తన అన్న కేటీఆర్ ను టార్గెట్ చేసారు. తనకు నీతులు చెప్పే వారికి పార్టీని నడిపే సత్తా లేదని పేర్కొన్నారు. లేఖ ఎవరు బయట పెట్టారో చెప్పమంటే డబ్బులు ఇచ్చి సొంతింటి ఆడబిడ్డను తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తాను ముందు ఒకటి.. తరువాత ఒకటి మాట్లాడనని స్పష్టం చేసారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. తాను అడ్డుగా భావించి తెలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ తో పాటుగా కేసీఆర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపైన ఉందని కవిత వ్యాఖ్యానించారు.

టార్గెట్ కేటీఆర్
ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు కేటీఆర్ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు కేసీఆర్ మాత్రమే నాయకుడని తేల్చి చెప్పారు. ఆయన నాయకత్వంలో మాత్రమే పని చేస్తానని స్పష్టం చేసారు. కేసీఆర్ ను కలిసే విషయంలో డెడ్ లైన్ పెట్టనని.. ఎప్పుడు కలిసేది చెప్పనని కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావగా పేర్కొన్న కవిత.. తాను 2013 లో మాత్రమే ఆ పార్టీ నేతలతో కలిసానని చెప్పారు. కొత్త పార్టీ ఎందుకని ప్రశ్నించిన కవిత.. కేసీఆర్ , పార్టీని కాపాడుకుం టే సరిపోతుందని చెప్పుకొచ్చారు. తాను ఉంటే బీజేపీలో పార్టీ విలీనం సాధ్యం కాదని.. తనను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. కేసీఆర్ ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటు న్నారని.. కేసీఆర్ ను నడిపించే సత్తా మీకు ఉందా అంటూ పరోక్షంగా కేటీఆర్ ను ప్రశ్నించారు.

mlc-kavitha-sensational-comments-on-her-political-future-and-on-brs

అంత సీన్ లేదు
దమ్ముంటే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీపై మీ ప్రతాపం చూపించాలని కవిత సవాల్ చేసారు. తాను నోరు విప్పితే తట్టుకోలేరంటూ బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేయకుండా.. ట్వీట్టర్‌లో మెసేజ్‌లు పెడితే సరిపోతాయా? అంటూ సోదరుడు కేటీఆర్‌ను ప్రశ్నించారు. తనను రేవంత్ రెడ్డి కోవర్ట్ అనటం కరెక్టేనా అంటూ నిలదీ సారు.పెయిడ్ ఆర్టిస్ట్‌లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జైలులో ఉన్నప్పుడే.. బీజేపీలో బీఆర్ఎస్‌ను కలపొద్దని కేసీఆర్‌ను కోరానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. తొందరపాటు నిర్ణయం వద్దని జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్‌కు సూచించానన్నారు. ఆరు నెలలు కాదు.. సంవత్సరాలు అయినా జైల్లో ఉంటానని కేసీఆర్‌కు తాను స్పష్టం చేశానని కవిత వివరించారు.

ఎందుకు ఈ ఏడుపులు
బీజేపీ నేతలకు చెందిన హాస్పిటల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్ళింది ఎవరో అందరకీ తెలుసని వ్యాఖ్యానించారు. తన లేఖ లీక్ చేసిందెవరు తేల్చమంటే.. తనపై పడి ఏడుస్తున్నారంటూ మండి పడ్డారు. పదవులు కోరినట్లు తనపై పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించారన్నారు. కేసీఆర్ లెక్క.. తాను చాలా తిక్కదానినని చెప్పుకొచ్చారు. సామాజిక తెలంగాణ సాధన కోసం తాను పోరాడుతానని స్పష్టం చేసారు. కొందరు స్థాయికి మించి ఊహించుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. జైలు వెళ్ళే టప్పుడు పార్టీకి, పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ వద్ దంటేనే తాను ఈ పదవిలో కొనసాగుతున్నానన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిజామాబాద్ ఎంపీగా తనను ఓడించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+