వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాము వదిలిన “బాణం”... తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రతిపక్ష బీజేపీ కి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుండగానే, తాజాగా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసిన ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా బిజెపి, వైయస్ఆర్ తెలంగాణ పార్టీలు పాదయాత్రలతో ప్రజాక్షేత్రంలో దూకుడు పెంచుతూ ముందుకు సాగుతుంటే, వారిని అడ్డుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీ శతవిధాలా ప్రయత్నం చేస్తోంది.

ఇక తెలంగాణ రాష్ట్రంలో కొంతకాలంగా ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల బసచేసే వాహనాన్ని తగల పెట్టడానికి ప్రయత్నించి, రాళ్లతో దాడి చేసిన ఘటనతో దీంతో వైయస్ షర్మిల ను పోలీసులు అరెస్ట్ చేసి బంజరా హిల్స్ లో ఆమె నివాసానికి తరలించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపద్యంలో, ప్రగతి భవన్ కు వెళుతున్న షర్మిలను అరెస్ట్ చేసి, కారుతో సహా ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఆపై ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక వైఎస్ షర్మిల అరెస్ట్ ఎపిసోడ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

MLC Kavitha targeted YS Sharmila and BJP.. Shocking post on Twitter!!

ఒక మహిళ పట్ల అసభ్యకరమైన రీతిలో కెసిఆర్ ప్రభుత్వం చూపుతున్న దురహంకారం చాలా అసహ్యకరమైనదని పేర్కొని ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. బహిరంగ సభలను నిషేధించడం,ప్రతిపక్షాల గొంతు నొక్కడం,ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం,వారి వాహనాలపై దాడులు చేసి పెట్రోల్ తో తగలబెట్టడం వంటి దుర్మార్గపూరిత చర్యలే ప్రధాన అజెండాగా టిఆర్ఎస్ పాలన సాగుతోంది అంటూ మండిపడ్డారు. ఇక వైఎస్ షర్మిల అరెస్టుపై పార్టీలకతీతంగా చాలామంది వైయస్ షర్మిల కు తమ మద్దతును ప్రకటించారు. టిఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

తెలంగాణాలో జ్యోతిష్యం ప్రకారమే ఎన్నికలు: ఇప్పుడు కూడా గ్రహాలన్నీ ఒకేవరుసలోకి రావాలేమో: సుప్రీం ధర్మాసనం!!తెలంగాణాలో జ్యోతిష్యం ప్రకారమే ఎన్నికలు: ఇప్పుడు కూడా గ్రహాలన్నీ ఒకేవరుసలోకి రావాలేమో: సుప్రీం ధర్మాసనం!!

ఇక ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్సీ కవిత రెండు పార్టీలను టార్గెట్ చేసి సెటైరికల్ ట్వీట్ చేశారు. షర్మిల తానా అంటే బీజేపీ నేతలు తందానా అంటున్నారని ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా ఎద్దేవా చేశారు. తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న తామరపువ్వులు అంటూ ట్వీట్ చేశారు. ఇక తన ట్విట్టర్ ద్వారా వైయస్సార్ తెలంగాణా పార్టీ, బీజేపీ రెండూ ఒకటేనని అర్థం వచ్చేలా కవిత పోస్ట్ చేశారు. వైయస్ షర్మిల వెనుక బీజేపీ నేతలు ఉన్నారని, బీజేపీనే వైయస్ షర్మిలను నడిపిస్తుంది అన్నట్టుగా కవిత ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

English summary
MLC Kavitha made shocking post in twitter targeting ys sharmila and bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X