తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం .. చంద్రబాబుకు కవిత స్పెషల్ రిక్వెస్ట్
తిరుమలలోని పురాతన హథీరాం బావాజీ మఠం కూల్చివేతకు అధికారులు సిద్ధమవుతుండటంతో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ మేరకు ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక కీలక విజ్ఞప్తి చేశారు.
తిరుపతి హాథిరాం బావాజీ మఠం కూల్చివేత ప్రయత్నాలు విరమించుకోవాలి
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 22, 2025
తిరుపతిలోని శ్రీ హాథిరాం బావాజీ మఠం భవనం కూల్చివేతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హాథిరాం బావాజీని ఆరాదించే బంజారాల మనోభావాలను దెబ్బతీస్తున్నది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు…
మఠాన్ని కూల్చివేయవద్దని డిమాండ్ చేస్తూ, ఈ నిర్ణయం హథీరాం బావాజీని ఆరాధించే బంజారా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని కవిత పేర్కొన్నారు. ఆమె పోస్టులో, భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడుని కోరారు.

హథీరాం బావాజీ మఠం కూల్చివేతతో తమ బతుకుదెరువు పోతుందని అక్కడి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురాతన నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేతకు టెండర్లు కూడా పూర్తి చేశారు. ఇలాంటి సమయంలో, కవిత చేసిన విజ్ఞప్తి ఆసక్తికరంగా మారింది. హథీరాం బావాజీ మఠానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications