బోధన్ ఎమ్మెల్యే నామినేషన్‌కు స్కూటీపై మ్మెల్సీ కవిత: అంబులెన్స్‌లో వెళ్లి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు మరొక్కరోజే గడువు ఉండటంతో గురువారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఈరోజే గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ఇక అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు దాఖలు చేశారు.
Due to traffic jams in Bodhan due where MLA #Shakeel was filing his nomination, MLC #Kavitha took a scooty ride to reach the venue, the starting point of a march @RaoKavitha @BRSparty pic.twitter.com/GcJ0YuXsYg
— Naveen S Garewal (@naveengarewal) November 9, 2023
కాగా, బోధన్ బీఅర్ఎస్ అభ్యర్థిగా షకీల్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కాసేపు స్కూటీపై కవిత ప్రయాణించి కార్యకర్తల్లో జోష్ నింపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నామినేషన్ అనంతరం కవిత మాట్లాడారు.

బోధన్ నామినేషన్ ముందు నిర్వహించిన భారీ ర్యాలీ విజయయాత్రతో తప్పక గెలుస్తారని కవిత అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కారు గుర్తుకు అందరూ ఓటు వేయాలని.. దక్షిణ భారతదేశంలో చరిత్ర సృష్టించారలని ప్రజలను కోరారు. కాగా, నామినేషన్ల ర్యాలీలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్ వేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఓ యువకుడి చేతిలో కత్తిపోటుకు గురైన ఆయనకు సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. దీంతో గత 10 రోజులుగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ప్రభాకర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు.
దుబ్బాకలో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొత్త ప్రభాకరన్న...
— Kotha Prabhakar Reddy (@KPRTRS) November 9, 2023
అనంతరం ఏర్పాటుచేసిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించిన మంత్రి @BRSHarish గారు...
మన ప్రభా "కారు" కే వొటేద్దాం..
దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం...
మన దుబ్బాక.. మన ప్రభాకరన్న... మన బిఆర్ఎస్… pic.twitter.com/0YcMWkGovD

ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. దుబ్బాకలో అంబులెన్స్ దిగిన తర్వాత వీల్ చైర్‌లో రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలను ఆర్వో గరిమ అగర్వాల్‌కు సమర్పించారు. అంతకుముందు దుబ్బాక పట్టణంలో భారీ ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను హరీశ్ రావు కోరారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications