3 వరకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఇవ్వొద్దు : సీఈసీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ : రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చేనెల 3 వరకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. రాములు నాయక్, యాదవరెడ్డి, భూపతిరెడ్డి మండలి సభ్యత్వం అనర్హతపై ఇవాళ విచారణ జరిగింది. ఈ పిటిషన్ కు సంబంధించి నిన్న అభ్యర్థుల వాదనల వినగా .. ఇవాళ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.
క్యాజువల్‌గానే ..
తాము రాహుల్ ను మర్యాదపూర్వకంగానే కలిసామని ముగ్గురు అభ్యర్థులు కోర్టుకు బుధవారం విన్నవించారు. తాము కాంగ్రెస్ లో చేరినట్టు ఆధారాలు చూపాలని కోరారు. తమపై మీడియాలో అసత్య వార్త కథనాలు ప్రసారమయ్యాయని వివరించారు. ఇవాళ వారు కాంగ్రెస్ లో చేరినట్టు ఆధారాలు, ఇతర రికార్డులు సమర్పిస్తామని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టును కోరారు. వీటిపై వాదనలు వినిపించేందుకు తమకు మరింత సమయం కావాలని కోరారు. అదనపు ఏజీ వాదనతో ఏకీభవించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను వచ్చేనెల 6కు వాయిదావేసింది.

నోటిఫికేషన్ ఇవ్వొద్దు
అయితే అప్పటి వరకు ఆ మూడు స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని స్పష్టంచేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీచేసింది. తిరిగి కేసు విచారణను జూన్ 6న చేపడుతామని పేర్కొంది. ఆ లోపు అదనపు ఏజీ ఆధారాలు సమకూర్చుకొని రావాలని తెలిపింది.












Click it and Unblock the Notifications