ఖమ్మంలో టిఆర్ఎస్ గెలుపు, నల్గొండలో కెసిఆర్‌కు షాకిచ్చిన కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల క్రితం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బుధవారం ఓట్ల లెక్కింపు జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నాలుగు స్థానాల్లో టిఆర్ఎస్, రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. టిడిపి సత్తా చాటలేకపోయింది. పాలమూరులో కొత్తకోట దయాకర్ రెడ్డి ప్రభావం కనిపించలేదు.
నల్గొండలో కాంగ్రెస్ విజయం
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. నల్గొండ ఎమ్మెల్సీ స్థానాన్ని కోమటిరెడ్డి కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కోమటిరెడ్డి 193 ఓట్లతో గెలుపొందారు.

ఖమ్మంలో టిఆర్ఎస్ గెలుపు
ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి విజయం సాధించారు. టిఆర్ఎస్ అభ్యర్థి బాలసాని 31 ఓట్ల తేడాతో గెలుపొందారు.
రంగారెడ్డి జిల్లాలో తెరాస ముందంజ
రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలలోను టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. శంభీపూర్ రాజా, నరేందర్ రెడ్డిలు విజయం సాధించారు.
మహబూబ్ నగర్లో పోటాపోటీ
మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ మొదటి స్థానంలో తెరాస అభ్యర్థి గెలిచారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి 65 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహబూబ్ నగర్ రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి విజయం దిశగా సాగుతున్నారు.
అభివృద్ధి చూసే: టిఆర్ఎస్, గుణపాఠం: కోమటిరెడ్డి
తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసే తమను గెలిపించారని ఖమ్మం నుంచి గెలిచిన బాలసాని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ ఎన్నికలు అధికార పార్టీకి గుణపాఠమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications