ఫ్రధాని మోడీ మనసు దోచిన గంగదేవిపల్లి: ఎందుకంటే..?
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో స్వచ్ఛభారత్ అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణలోని ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిని కొనియాడటం విశేషం. వ
న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం 'మన్ కీ బాత్' ప్రసంగంలో స్వచ్ఛభారత్ అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణలోని ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిని కొనియాడటం విశేషం. వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి ఇప్పటికే ఎన్నో అంశాల్లో ఘనత సాధించిన సంగతి తెలిసిందే. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణంతో ఈ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

ప్రధాని ప్రశం
మరుగుదొడ్ల నిర్మాణంలో ఈ గ్రామం వినూత్న విధానాన్ని అవలంబిస్తోంది. ‘రెండు గుంతల విధానం'లో నిర్మించిన ఈ మరుగుదొడ్లను ఇటీవల కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ (డీడబ్ల్యూఎస్) కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ బృందం స్వయంగా పరిశీలించింది. ఇటీవలే ఈ గ్రామంలో వైఫై సౌకర్యాన్ని సైతం ఏర్పాటు చేశారు. ‘రెండు గుంతల విధానాన్ని' అన్ని గ్రామాలూ అనుసరించాలని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొనారు.

నూతన ప్రక్రియ
సాధారణంగా సేంద్రీయ ఎరువులు పశువుల పేడ, ఇతర పంట ఉత్పత్తుల వ్యర్థాలతో తయారవుతాయి. కానీ ఈ గ్రామంలో మానవ విసర్జితాలను సేంద్రీయ ఎరువుగా మార్చి అందరి దృష్టిని ఆకర్షించారు. గంగదేవిపల్లిలో 2000 సంవత్సరంలోనే ప్రతి ఇంట్లో మరుగుదొడ్లను నిర్మించారు. అప్పట్లోనే వినూత్న రీతిలో ఈ మరుగుదొడ్లకు రెండు చొప్పున గుంతలను ఏర్పాటు చేశారు.

2003 నుంచే..
గ్రామస్తులందరూ 2003వ సంవత్సరం నుంచి రెండుగుంతల మరుగుదొడ్లను వినియోగించడం ప్రారంభించారు. 2014 నాటికి వాటిలో ఒక గుంత నిండిపోగానే దానిని శాస్త్రీయ పద్ధతిలో మూసివేసి, విసర్జితాలను రెండో గుంతలోకి పంపడం ప్రారంభించారు. మొదటి గుంతలను ఇటీవల తెరిచినప్పుడు అందులో బలమైన సేంద్రీయ ఎరువు తయారైనట్టు గమనించారు. అది హానికారం కాని, ఎటువంటి దుర్వాసన లేని అచ్చమైన సేంద్రీయ ఎరువుగా మారినట్టు పలు స్వచ్ఛంద సంస్థలు, యూనిసెఫ్ ప్రతినిధులు నిర్ధారించారు.

యూనిసెఫ్ ప్రతినిధుల సందర్శన
ఇలా మానవ విసర్జితాలు సేంద్రీయ ఎరువుగా రూపాంతరం చెందటం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో కేంద్ర గ్రామీణ, నీటి సరఫరా, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి పరమేశ్వర్ అయ్యర్ నేతృత్వంలో ఇతర కేంద్ర అధికారులు 23 రాష్ర్టాలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, 42 మంది ఐఏఎస్ అధికారులు, ఐదుగురు యూనిసెఫ్ ప్రతినిధులు ఈ నెల 17, 18 తేదీల్లో గంగదేవిపల్లిని సందర్శించారు.

అద్భుత ప్రక్రియ
అధికారుల్లో కొందరు గుంతల్లోకి దిగి ఆ ఎరువును చేతితోనే పైకి తీసి, వాటి వాసనను గమనించారు. ఆ తరువాత ఆ గుంతలను శుభ్రం చేసి మళ్లీ ఎలా వినియోగంలోకి తీసుకురావచ్చో చేసి చూపించారు. మానవ విసర్జితాలు ఇలా ఎరువుగా మారడం అద్భుతమైన ప్రక్రియ అని యూనిసెఫ్ ప్రతినిధి రాబర్ట్ చాంబర్స్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ విధానాన్ని అంతటా విస్తరించాలని సూచించారు. గంగదేవిపల్లి విజయగాథలు ఆకట్టుకున్నాయని, ఇక్కడ రెండు గుంతల మరుగుదొడ్ల నిర్మాణంలో సాంకేతికత చాలా సులువైనదేనని లండన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కుర్టీస్ పేర్కొన్నారు. గంగదేవిపల్లిలో గ్రామ స్వరాజ్యాన్ని అధ్యయనం చేసేందుకు గతంలో కెనడా, బంగ్లాదేశ్‌తోపాటు మన దేశంలోని తమిళనాడు, రాజస్థాన్, పాండిచ్చేరి ప్రతినిధులు సైతం సందర్శించారు.












Click it and Unblock the Notifications