వీడియో: ఘాటుగా రియాక్ట్ అయిన మంచు విష్ణు..!!
Manchu Vishnu: ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి తగాదాలు తెర మీదికి వచ్చాయి. విభేదాలు భగ్గుమన్నాయి. పరస్పరం భౌతికంగా దాడులు చేసుకునేంత వరకూ వెళ్లాయి. చివరికి- పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకునేంత పరిస్థితి తలెత్తింది.
తన భార్య భూమా మౌనిక రెడ్డిపై తండ్రి మోహన్ బాబు దాడి చేశారంటూ ఆయన కుమారుడు, నటుడు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తననూ కొట్టాడంటూ మనోజ్ లిఖిత పూరకంగా పహాడీ షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీనికి ప్రతిగా మోహన్ బాబు కూడా మంచు మనోజ్‌పై ఫిర్యాదు చేశారు. మనోజ్, కోడలు మౌనిక తనను కొట్టారంటూ రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారాయన.

ఈ మేరకు మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్‌కు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. మనోజ్ వల్ల తనతో పాటు భార్య ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీన తన ఇంటికి వచ్చిన మనోజ్ అనుచరులు అలజడి సృష్టించారని, భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు.
సోమవారం తెల్లవారు జామున కూడా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హల్‌చల్ చేశారని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు వివరించారు. ఉదయం 10: 30 గంటల సమయంలో మరోసారి మనోజ్ అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లోకి జొరబడ్డారని, తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పరిణామాల మధ్య మోహన్ బాబు పెద్ద కుమారుడు, నటుడు మంచు విష్ణు.. దుబాయ్ నుంచి కొద్దిసేపటి కిందటే హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడటానికి విలేకరులు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు.
దుబాయ్ నుండి నేరుగా మోహన్ బాబు ఇంటికి వెళ్లిన మంచు విష్ణు#MohanBabu #ManchuManoj #ManchuMohanBabu #ManchuFamily #Oneindiatelugu pic.twitter.com/MkjoAKkDQf
— oneindiatelugu (@oneindiatelugu) December 10, 2024
కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి కదా? దీనిపై మీ స్పందన ఏమిటంటూ ప్రశ్నించిన విలేకరులపై మంచు విష్ణు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కుటుంబంలో సమస్యలన్నీ కూడా పరిష్కారమౌతాయని తేల్చి చెప్పారు. కుటుంబాల్లో గొడవలు, సమస్యలు సహజమేనని వ్యాఖ్యానించారు. దీన్ని పెద్ద ఇష్యూ చేయడం అనవసరమని అన్నారు.
మంచు విష్ణు కన్నప్ప సినిమాలో నటిస్తోన్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ఆరు భాషల్లో ఇది రాబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. మోహన్ బాబు నిర్మాత. ఏవీఏ ఎంటర్టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను సమర్పించాయి.












Click it and Unblock the Notifications