బోటు ప్రమాదంపై మోహన్ బాబు: వారి కక్కుర్తి 20 మంది ప్రాణాలు తీసింది!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: విజయవాడలో పవిత్ర సంగమం వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇరవైకి చేరింది. ఈ ప్రమాదంపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు.

  Boat Mishap : Chandrababu Naidu Statement In AP Assembly

  దేవుడా! ఒక్కసారి బతికించు: బోటు ప్రమాదం చివరి నిమిషంలో, సీపీఐ నారాయణ సోదరి మృతి

  దిగ్భ్రాంతిని కలిగించింది

  ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణా నదిలో జరిగిన ఈ ఘోర ప్రమాదం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

  నిలిచిన నవహారతులు

  నిలిచిన నవహారతులు

  2 నిమిషాల్లో క్షేమంగా ఒడ్డుకు చేరాల్సిన సమయంలో ఎన్నో కుటుంబాల్లో బోటు ప్రమాదం విషాదం నింపింది. ఈ విషాధ ఘటనతో పవిత్ర సంగమంలో జరగాల్సిన నవహారతులు నిలిచిపోయాయి. కార్తీక మాసం, పైగా ఆదివారం కావడంతో హారతులను తిలకించేందుకు పెద్ద ఎత్తున పవిత్ర సంగమానికి వచ్చారు. హారతి ఏర్పాట్లు జరుగుతుండగానే బోటు తిరగబడటంతో నవ హారతులు నిలిపివేశారు.

   నా భార్య పుట్టింటి వారు ముగ్గురు మృతి చెందారు

  నా భార్య పుట్టింటి వారు ముగ్గురు మృతి చెందారు

  పడవ ప్రమాదం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ ప్రమాదంలో తన భార్య పుట్టింటికి చెందిన ముగ్గురు మహిళలు మృతిచెందారన్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం పూర్తిగా నిర్వహణ లోపమే అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

  ఒక్కొక్కరి నుంచి రూ.300 వసూలు చేసినా

  ఒక్కొక్కరి నుంచి రూ.300 వసూలు చేసినా

  రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వెంచర్స్‌ సంస్థ పర్యాటకలు ఒక్కొక్కరి నుంచి రూ.300 టిక్కెట్టు వసూలు చేసింది. అయినా కేవలం రూ.40 వేలు వెచ్చించలేకపోయారు. దీంతో దాదాపు 20 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. బోట్లలో ప్రయాణించే వారికి అవసరమైన కనీస లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచలేకపోయారు.

   అలా ప్రాణ నష్టం తగ్గేది

  అలా ప్రాణ నష్టం తగ్గేది

  బోటు ఎక్కేటప్పుడే పర్యాటకులు లైఫ్‌ జాకెట్లు గురించి అడిగినా వాటి అవసరం లేదని నిర్వాహకులు చెప్పారు. బోట్లో అవి కావాల్సినన్ని అందుబాటులో ఉండి, పర్యాటకులు వాటిని ధరించి ఉంటే ప్రమాదం జరిగినా, ప్రాణనష్టం తగ్గి ఉండేది. ఏపీ పర్యాటక శాఖ బోటు విహారానికి రూ.60 మాత్రమే వసూలు చేస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  'I am deeply saddened with tragic boat accident that happened in Krishna river. May God be with the bereaved families.' Actor Mohan Babu tweeted.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి