మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు!

మొయినాబాద్ ఫాం హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు 11మంది ఉన్నట్టు ఈగల్ టీమ్ గుర్తించింది. ఈ డ్రగ్స్ కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో డ్రగ్స్ తో పాటు మద్యం కూడా తీసుకున్నట్టు పేర్కొన్నారు.

మద్యంలో కొకైన్ కలుపుకుని తాగినట్టు ఎఫ్ఐఆర్

కొంతమంది మద్యంలో కొకైన్ కలుపుకొని తాగినట్టు కూడా పోలీసులు గుర్తించినట్టు ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 11 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో ఆరుగురికి డ్రగ్స్ వినియోగం చేసినట్టు పాజిటివ్ ఫలితాలు వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. పోలీసులు దాడి చేసిన సమయంలో తమను పోలీసులు అని చెప్పినప్పటికీ కాల్పులు జరిపినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.

moinabad farmhouse drugs party case Police FIR reveals major shocking details in this drugs case

ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు

ఈ కేసులో రితేష్ రెడ్డి వద్ద ఉన్న రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా కౌశిక్ సిమ్లాలో కొకైన్ కొనుగోలు చేసినట్టు అంగీకరించినట్టు ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. ఈ ఫామ్ హౌస్ పార్టీకి రోహిత్ రెడ్డి ఆహ్వానంమేరకే అందరూ హాజరైనట్టు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

టిడిపి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పైన కేసు

ఇదిలా ఉంటే ఈ డ్రగ్స్ కేసులో టిడిపి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పైన కూడా కేసు నమోదయింది. డ్రగ్స్ టెస్టులో ఆయనకు కూడా పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు నిర్ధారించారు. స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరారు.

నిజమే చెబుతాను, అబద్ధాలు చెప్పను అన్న టీడీపీ ఎంపీ

ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా, తాను నడుచుకొని తాను ఎప్పుడూ నిజమే చెబుతాను అంటూ వీడియో రిలీజ్ చేశారు. ఎన్నో రోజుల నుంచి కలుద్దామని కోరుతున్న క్రమంలో, తాను అక్కడికి వెళ్లానని, అక్కడ డిన్నర్ లో తాను ఎటువంటి తప్పు చేయలేదన్నారు. ఎప్పుడు నిజమే చెబుతాను, అబద్ధాలు చెప్పను అంటూ ఆయన తన వీడియోలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+