హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భయం గుప్పిట్లో హైద్రాబాద్: క్యుములోనింబస్ మేఘాలు అంటే ఏమిటీ?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:వారం రోజులుగా హైద్రాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షం పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు.చినుకు పడితే రోడ్లపై నీరంతా నిలిచిపోతోంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో వావాహదారులు ఇబ్బందులుపడుతున్నారు. క్యుములోనింబస్ మేఘాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖాధికారులు ప్రకటిస్తున్నారు. ఇంకా 48 గంటల పాటు హైద్రాబాద్‌లో వర్షం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

హైద్రాబాద్‌‌ను ముంచేసిన వర్షం: భయం గుప్పిట్లో...హైద్రాబాద్‌‌ను ముంచేసిన వర్షం: భయం గుప్పిట్లో...

వారం రోజులుగా వర్షం హైద్రాబాద్ నగర వాసులను ముప్పుతిప్పలు పెడుతోంది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో భారీ వర్షపాతం నమోదైతోంది. గంటల వ్యవధిలో పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడంతో రోడ్లపై బారీగా నీటి ప్రవాహం చేరుతోంది.

క్యుములోనింబస్ ఎఫెక్ట్: 16 కి.మీ.లపై ప్రభావం, హైద్రాబాద్‌‌ను ముంచెత్తింది క్యుములోనింబస్ ఎఫెక్ట్: 16 కి.మీ.లపై ప్రభావం, హైద్రాబాద్‌‌ను ముంచెత్తింది

ఇంకా 48 గంటల పాటు హైద్రాబాద్‌తో పాటు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

వర్షం ఎఫెక్ట్: 6 ఫీట్ల ఎత్తులో ఎగజిమ్మిన విషపు నురగ, భయంతో ఇళ్ళలోనే.. వర్షం ఎఫెక్ట్: 6 ఫీట్ల ఎత్తులో ఎగజిమ్మిన విషపు నురగ, భయంతో ఇళ్ళలోనే..

హైద్రాబాద్ శివారు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం కురిసిన వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇంకా కూడ వర్ష ప్రభావం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేస్తోంది.

క్యుములోనింబస్ పేరేలా వచ్చిందంటే?

క్యుములోనింబస్ పేరేలా వచ్చిందంటే?

నలుపు రంగులో, దట్టంగా, ఎక్కువ విస్తీర్ణంలో, భారీ ఉరుములు, మెరుపులతో కూడిన మేఘాలను క్యుములోనింబస్‌ మేఘాలు అంటారు.వాతావరణంలో క్షణాల్లో పెనుమార్పులు సంబవిస్తాయి. ఎండగా ఉన్న వాతావరణం చీకటిగా మారుతోంది.క్షణాల్లో నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి.ల్లుతెరిచే లోపు కుండపోతవర్షం కురుస్తోంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షపాతం నమోదు అవుతోంది. లాటిన్‌లో ‘క్యుములోస్‌' అంటే ఒకే చోట గుట్టగా పెట్టిన అని అర్థం. ‘నింబస్‌' అంటే కాలమేఘం అని అర్థం. క్యుములోనింబస్‌ మేఘాలు దట్టంగా నల్లగా ఉంటాయి కాబట్టి వాటికి ఆ పేరు పెట్టారు.

క్యుములోనింబస్ మేఘాలు నలుపు రంగులో ఎందుకు ఉంటాయి?

క్యుములోనింబస్ మేఘాలు నలుపు రంగులో ఎందుకు ఉంటాయి?

క్యుములోనింబస్ మేఘాలు నలుపురంగులో ఉంటాయి.క్యుములోనింబస్‌ మేఘాల కింద భాగంలో నీరు పై భాగంలో ఐస్‌ ఉంటుంది. మేఘాల పైభాగంలో జీరో డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది.నీరు, ఐస్‌తో కలిసి ఉండటం వల్ల మేఘాలు నలుపు రంగులో కనిపిస్తాయి.ఇవి నిలువుగా ఏర్పడి దట్టంగా అలుముకుంటాయి. దీంతో గాలులు బలంగా వీచే అవకాశం ఉంది.20వేల అడుగుల ఎత్తులో ఏర్పడి 39వేల అడుగుల వరకు విస్తరిస్తాయి.

మూడు గంటల్లోనే క్యుములోనింబస్ మేఘాలు

మూడు గంటల్లోనే క్యుములోనింబస్ మేఘాలు

గాలిలో ఎక్కువగా తేమ చేరడం, భారీ ఉష్ణోగ్రతలు, వాతావరణంలో అస్థిరత వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. భూ వాతావరణంలో వేడి బాగా ఎక్కువైనప్పుడు గాలి తేలిక పడి పైపైకి వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో వాతావర ణంలో ఉన్న కాలుష్యరేణువులు వీటికి తోడవుతాయి. ఆ సమయంలో గాలి హఠాత్తుగా చల్లబడితే క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడతాయి. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడడానికి రెండు మూడు గంటల సమయం మాత్రమే సరిపోతోంది.

తక్కువ ఎత్తు నుండే వర్షం

తక్కువ ఎత్తు నుండే వర్షం

క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ శబ్దాలతో కూడిన ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్లు, పిడుగులు పడి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.30 నిమిషాల నుంచి 2-3 గంటల వరకు భీకర వర్షం కురుస్తుంది.16 కిలోమీటర్ల మేర భారీ వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.మధ్యాహ్నం వరకు నమోదైన ఉష్ణోగ్రతల ఆధారంగా క్యుములోనింబస్‌ మేఘాలు భూమికి 1-2 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడి విధ్వంసం సృష్టిస్తాయి. మేఘాల్లో గాలుల తీవ్రత సెంటీమీటర్ల స్థాయిలో ఉంటే వీటిలో మాత్రం 15-20 మీటర్ల తీవ్రత ఉంటుంది.వేసవిలో భూమికి సుమారు 15 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడే క్యుములోనింబస్‌ మేఘాలు, వర్షాకాలంలో 2-10 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడతాయి.

నష్టనివారణకు వాతావరణ శాఖ ప్రయత్నం

నష్టనివారణకు వాతావరణ శాఖ ప్రయత్నం

క్యుములోనింబస్‌ మేఘాలతో పిడుగులు, ఉరుములతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ముందుగా పసిగట్టే నౌకాస్ట్‌ సాంకే తికతను భారత వాతావరణ శాఖ అందుబాటులోకి తెచ్చిం ది. క్యుమలోనింబస్ మేఘాలతో ఏర్పడే ప్రమాదాన్ని 3 గంటల ముందే ఎయిర్‌ పోర్టు అథారిటీ, విపత్తుల నివారణ శాఖకు సమాచారం పంపి అప్రమత్తం చేస్తుంది. ఏపీలో పిడు గులు పడే సమాచారం ముందుగానే ఆయా పారంతాల ప్రజలకు సెల్‌ఫోన్‌ల ద్వారా అందుతోంది. క్యుములోనింబస్‌ మేఘాల తీవ్రత సమాచారాన్ని కూడా ప్రజలకు ముందే అందిస్తే జాగ్రత్తలు తీసుకొని, నష్ట తీవ్రతను తగ్గించవచ్చని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నైరుతి రుతుపవనాల నిష్క్రమణ కారణంగానే

నైరుతి రుతుపవనాల నిష్క్రమణ కారణంగానే

సాధారణంగా నైరుతి రుతుపవనాల నిష్క్రమణ సెప్టెంబరు రెండో వారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది దాదాపు 12 రోజుల ఆలస్యంగా వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ మొదలైంది. ఈ సమయంలో ఉత్తరాది నుంచి పొడి గాలులు దక్షిణాది వైపు వీస్తుంటాయి. బంగాళాఖాతం నుంచి వీచేతేమగాలులను ఇవి పైకి తీసుకుపోతాయి. 9-12 కిలోమీటర్ల ఎత్తువరకు గాలులు వెళ్తుంటాయి. భూఉపరితలం నుంచి మేఘాలు పైకి వెళ్లే కొద్ది ఉష్ణో గ్రతలు తగ్గుతాయి. పైకి 6 కిలోమీటర్లు దాటిన తర్వా త ఉపరితలంలో మైనస్‌ డిగ్రీల్లో ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడే మంచు గడ్డలు ఏర్పడతాయి. ఎత్తుకు వెళ్లే కొద్ది మం చు గడ్డలతో మేఘాలబరువు పెరుగుతుంది. 12 నుం చి 13 కిలోమీటర్లకు వెళ్లేసరికి బరువు భరించలేక మేఘాలు విచ్ఛిన్నమవుతాయి. దీనినే ‘క్లౌడ్‌ బరస్ట్‌' అంటారు.

English summary
Heavy rains are likely to lash Hyderabad and the rest of the districts over the next 48 hours, Met experts attributed it to a low pressure area building over the north-west Bay of Bengal and an upper air circulation over Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X