లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్.. 106 కేసులు, రూ.కోటి రివార్డు !

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన.. అలియాస్ మైన్ అక్క, మైన బాయి, సుజాత ఈరోజు (సెప్టెంబర్ 13, 2025) తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎదుట లొంగిపోయారు. 43 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆమె.. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. సుజాతక్కపై రూ.1 కోటి రివార్డు ఉండగా.. 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఛత్తీస్‌గఢ్‌ సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో ఇన్‌ఛార్జిగా ఉన్నారు.

వ్యక్తిగత నేపథ్యం..

పద్మావతికి ప్రస్తుతం 62 సంవత్సరాలు. ఆమె జోగులాంబ గద్వాల్ జిల్లా, గట్టు మండలం, పెంచికల్పాడు గ్రామానికి చెందినవారు. తండ్రి తిమ్మారెడ్డి వ్యవసాయదారుడు, గ్రామ పోస్ట్‌మాస్టర్‌; 1983లో మరణించారు. తల్లి వెంకమ్మ గృహిణి. ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.

most-wanted-maoist-potula-kalpana-surrendered-to-telangana-police

ఉద్యమంలోకి ఎంట్రీ ..

1982లో గద్వాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆమె ఉద్యమంలోకి ప్రవేశించారు. బంధువులు పటేల్ సుధాకర్ రెడ్డి, పోతుల సుదర్శన్ రెడ్డి, సుగుణ ప్రభావంతో మొదట గ్రామ ప్రచారకర్తగా పనిచేశారు. తరువాత జన నాట్య మండలిలో చేరి గద్దర్‌, మాల సంజీవ్‌లతో కలిసి కొంతకాలం పనిచేశారు.

వివాహం..

హైదరాబాద్‌లోని కోఠి పీస్ బుక్ సెంటర్‌లో పనిచేసే సమయంలో మావోయిస్టు సీనియర్ నాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీని కలుసుకున్నారు. 1984లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. 1987లో దండకారణ్యంలో కార్యకలాపాలు ప్రారంభించారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. 2011లో పశ్చిమ మిడ్నాపూర్ (పశ్చిమ బెంగాల్)లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మరణించారు.

మావోయిస్టు హైరార్కీలో ఎదుగుదల..

1988 - ఎటపల్లి దళం డిప్యూటీ కమాండర్

1996 - దేవూరి దళం కమాండర్

1997-1999 - డివిజనల్ కమిటీ సభ్యురాలు

2001 - రాష్ట్ర కమిటీ సభ్యురాలు

2007 - సిపిఐ (మావోయిస్టు) కాంగ్రెస్‌లో డికెఎస్‌జెడ్‌సి సెక్రటేరియట్ సభ్యురాలు

2018 - దండకారణ్య జనతానా సర్కార్‌ ఇన్‌చార్జి

2022 - సౌత్ సబ్-జోనల్ బ్యూరో సెక్రటరీ

2023 - కేంద్ర కమిటీ సభ్యురాలు

అదేవిధంగా, ఆమె కోయ భాషా పత్రిక 'పెథూరి' సంపాదకురాలిగా కూడా పనిచేశారు.

most-wanted-maoist-potula-kalpana-surrendered-to-telangana-police

2025 మేలో ఆరోగ్యం క్షీణించడంతో సంస్థ నుండి బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ నాయకుడు పుల్లూరి ప్రసాదరావు ద్వారా కేంద్ర కమిటీకి తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఆమెపై ఉన్న రూ.25 లక్షల రివార్డు ఇప్పుడు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అందజేయబడింది.

తెలంగాణ డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. సుజాతక్క లొంగుబాటు రాష్ట్ర వ్యతిరేక మావోయిస్టు విధానానికి ఒక నైతిక విజయం అన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 404 మంది మావోయిస్టు క్యాడర్‌లు లొంగిపోయారని తెలిపారు. వీరిలో నలుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక డివిజనల్ కమిటీ సెక్రటరీ, ఎనిమిది డివిజనల్ కమిటీ సభ్యులు, 34 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు.

ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు పార్టీలో తెలంగాణకి చెందిన వారు 78 మంది ఉన్నారని.. ప్రస్తుతం ఉన్న 15 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 10 మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారని స్పష్టం చేశారు. పోలీసులకు మావోలు లొంగిపోవాలంటే ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుందని వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+