ఆత్మహత్య: ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు చక్రాల్లో నలిగి తల్లీకూతుళ్ల మృతి
హైదరాబాద్: ఏపీ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి శుక్రవారం ఉదయం బయల్దేరిన ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలులో తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని మంద్రమర్రి-మంచిర్యాల రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని మహిళ తన కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ క్రమంలో రైలు నుంచి దూకిన వారిద్దరూ రైలు చక్రాల్లో ఇరుక్కుపోయారు. ట్రైన్ రన్నింగ్‌లో ఉండగా జరిగిన ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాన్ని ఆలస్యంగా గుర్తించిన రైల్వే సిబ్బంది మంచిర్యాలలో రైలును ఆపేశారు.
ఆ తర్వాత ఇంజన్‌లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. మంచిర్యాల జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో గుర్తుతెలియని మహిళతో పాటు ఓ చిన్నారి మృతదేహాన్ని గుర్తించామన్నారు.

లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేసి అధికారులకు ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. దీంతో వారిద్దరి మృతదేహాలను వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతదేహాలను తీసిన అనంతరం రైలు 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications