ముగ్గురు పిల్లలతో తల్లి మృతి: హత్యా, ఆత్మహత్యా?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులో ఓ తల్లి తన ముగ్గురు కూతుళ్లతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని మరణించింది. ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఈ సంఘటనపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
చిలుకూరు గ్రామానికి చెందిన గిరీశ్‌కు, హైదరాబాద్ పాతబస్తీ జియాగూడ ప్రాంతానికి చెందిన అనిత (25)తో ఐదేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మౌనిక (4), అక్షిత (3), జయలక్ష్మి (1) సంతానం. గిరీశ్ వృత్తిరీత్యా కారు డ్రైవర్. రోజు మాదిరిగానే ఉదయాన్నే విధులకు వెళ్లి సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న గిరీశ్ ఇంట్లో నుంచి పొగలు రావటాన్ని గమనించి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు విరగ్గొట్టాడు. అప్పటికే అనిత, ముగ్గురు పిల్లలు అగ్నికి ఆహూతయ్యారు.

సమాచారం అందుకున్న సీఐ రవిచంద్ర, ఎస్‌ఐలు రవీందర్‌నాయక్, సంజీవ తమ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భర్త గిరీశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవారని గ్రామస్తులు చెప్పడంతో ఎవరైనా హత్యచేసి ఉంటారా? లేక వారే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా? అన్న కోణంలోదర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవిచంద్ర తెలిపారు.
లారీ దూసుకెళ్లి ముగ్గురు మృతి
వరంగల్ జిల్లాలోని నర్సింహులుపేట మండలం బీరిశెట్టిగూడెంలో లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఇంట్లోకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సునీత, రాహుల్, అమ్ములుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications