ఆశ్చర్యం: నీలోఫర్ ఆస్పత్రిలో 6 కిలోల బరువున్న శిశువు జననం
హైదరాబాద్: నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో 6 కిలోల బరువున్న శిశువు జననం వైద్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్‌లోని బోరబండకు చెంది షబానా అనే మహిళ శనివారం ఉదయం 6 కిలోల బాబుకు జన్మనిచ్చింది.

అప్పుడే కొత్తగా పుట్టిన శిశువు బరువు సాధారణంగా 2 నుంచి 4 కిలోల మధ్యే ఉంటుంది. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
అత్యంత అరుదుగానే ఇంత బరువుతో పిల్లలు పుడతారని వైద్యులు వెల్లడించారు. పుట్టడంతోనే ఆరు కిలోలున్న శిశువును చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి
ఖమ్మం జిల్లా పాల్వంచ వికలాంగుల కాలనీలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ పాడుబడ్డ ఇంట్లో బాలుడి మృతదేహం పడి ఉండడం కలకలం రేపింది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన సంతోష్ అనే ఎనిమిదేళ్ల బాలుడు కాలనీలోని ఓ పాడుబడ్డ ఇంట్లో మృతి చెందాడు.
మృతదేహాన్ని గమనించిన స్థానికులు ఆ మృతదేహం సంతోష్‌దిగా గుర్తించి స్థానిక పోలీసులకి సమాచారాన్ని అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications