అక్రమ సంబంధానికి అడ్డని కూతురిని చంపిన తల్లి: ముఖం చాటేసిన వరుడు

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల కూతురు లక్ష్మిని తల్లి హత్య చేసింది. హత్య చేసిన తర్వాత కూతురి శవాన్ని తల్లి జయమ్మ బాలిక మృత దేహాన్ని సంపులో పడేసింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందనే కారణంతోనే ఆమె కూతురిని చంపినట్లు అనుమానిస్తున్నారు.

బాలిక ఏమైందని బంధువులు నిలదీయడంతో తానే చంపినట్లు అంగీకరించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని తల్లి జయమ్మను అరెస్టు చేశారు.

Crimescene

ఇదిలావుంటే, మరికొద్ది నిమిషాల్లో పెండ్లి జరుగుతుందనగా పెళ్లి కూతురు నచ్చలేదని వరుడు చెప్పడంతో పీటల మీద వివాహం ఆగిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని వారాసి గూడలో చోటుచేసుకుంది. హయత్‌నగర్‌కు చెందిన సతీష్(27)కు వారాసిగూడకు చెందిన అమ్మాయికి వివాహం కుదిరింది. వివాహం జరిపించాలని నిర్ణయించారు.

తీరా సమయానికి వరుడు తరఫు వారు రాలేదు. వధువు తరఫు వారు విషయం కనుక్కోగా దూరపు బంధువులు చనిపోయారని చెప్పారు. అనుమానం వచ్చి నిలదీయగా తనకు వివాహం ఇష్టం లేదని వరుడు అసలు విషయాన్ని బయటపెట్టాడని వధువు కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో చిలుకానగర్ పోలీస్‌స్టేషన్‌లో వధువు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+