చిరు కూడా కెసిఆర్‌కు భయపడే..: సినీ స్టార్లపై మోత్కుపల్లి సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలకు మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు భయపడే వచ్చినట్లున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు.

  బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి ఒకే వేదికపై : పొగడ్తల హోరు !

  చదవండి: రామోజీని పిలవరా, ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు: మోత్కుపల్లి సంచలనం, కంటతడి

  ప్రపంచ తెలుగు మహాసభల్లో సంపన్నులకు, పెత్తందార్లకు మాత్రమే స్థానం కల్పించారని, పేదవారిని, పేద కవులను కేసీఆర్‌ తీవ్రంగా అవమానించారని ఆయన నిప్పులు చెరిగారు. పేదవారిని గౌరవించాల్సిన అవసరం లేదనే ధోరణితో కేసీఆర్‌ వ్యవహరించారని అన్నారు. పేదవారి సొమ్మంతా పెద్దలకు పంచి పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.

   ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారు..

  ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారు..

  గతంలో తెలుగువారిని మద్రాసీలు అనేవారని, తెలుగువారి ప్రాముఖ్యాన్ని ఢిల్లీకి చెప్పింది ఎన్టీ రామారావు అని, ఎన్టీఆర్‌ను ఎందుకు విస్మరించారని, తనకూ కెసిఆర్‌కు కూడా రాజకీయ గురువు ఎన్టీఆరేనని, అలాంటి ఎన్టీఆర్ గురించి నాలుగు మాటలు చెప్తే కెసిఆర్ పదవి పోతుందా అని ఆయన ప్రశ్నించారు.

   చంద్రబాబును ఎందుకు పిలువలేదు...

  చంద్రబాబును ఎందుకు పిలువలేదు...

  ప్రపంచ తెలుగు మహాసభలు ప్రపంచ తెలుగు ప్రజల పర్వం అయినప్పుడు ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కెసిఆర్ ఎందుకు ఆహ్వానించలేదని మోత్కుపల్లి ప్రశ్నించారు. అమరావతి శంకుస్థాపన సమయంలో, కేసీఆర్‌ యాగం సమయంలో ఇరువురు ముఖ్యమంత్రులు ఇచ్చి పుచ్చుకున్నట్లు వ్యవహరించిన సందర్భం ఉందని ఆయన చెప్పారు.

  మీడియా పాత్ర కూడా..

  మీడియా పాత్ర కూడా..

  సుప్రీంకోర్టు దాకా తెలుగువాళ్లు ఉన్నారని అలాంటి వారిని గౌరవిస్తే కేసీఆర్‌కే పేరొచ్చి ఉండేదని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. కనీసం మీడియా పాత్ర కూడా ప్రపంచ తెలుగు మహాసభల్లో లేదని ఆయన అన్నారు. సభకు వచ్చిన వారంతా కూడా కేసీఆర్‌కు భయపడి చేశారా, నిజంగానే చేశారా అనేది అర్థం కావడం లేదనిఅన్నారు.

   వారినంతా ఎందుకు మరిచిపోయారు..

  వారినంతా ఎందుకు మరిచిపోయారు..

  తెలంగాణ దళిత కవులు విమలక్క, గద్దర్‌, వందేమాతరం, శ్రీనివాస్‌, అందెశ్రీని ఎందుకు కేసీఆర్‌ గౌరవించలేదని మోత్కుపల్లి మండిపడ్డారు. సినిమా యాక్టర్లు కూడా భయంతో వచ్చారు గానీ ప్రేమతో రాలేదని ఆయన అన్నారు.

   బాలకృష్ణ యాక్టర్ మాదిరిగానే...

  బాలకృష్ణ యాక్టర్ మాదిరిగానే...

  ప్రపంచ తెలుగు మహాసభలకు చిరంజీవి కూడా భయంతోనే వచ్చినట్లున్నరని అనుకుంటున్నట్లు మోత్కుపల్లి అన్నారు. బాలకృష్ణ కూడా అందరు యాక్టర్ల మాదిరిగా వచ్చి వెళ్లారని అన్నారు.

   యాక్టర్లంతా గొర్రెల్లాగా దండలు

  యాక్టర్లంతా గొర్రెల్లాగా దండలు

  యాక్టర్లంతా గొర్రెల మాదిరిగానే దండలు వేయించుకున్నారని, వారు ఎన్టీఆర్‌ గురించి మాట్లాడాలని అనుకున్నా కేసీఆర్‌ భయంతో మాట్లాడలేకపోయారని మోత్కుపల్లి అన్నారు. కేసీఆర్‌ తీరు నిరంకుశ, నియంతృత్వవాదానికి ప్రతీకగా ఉందని ఆయన అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugu Desam Party (TDP) leader Mothkupalli Narshihulu made serious comments on Telangana CM K Chandrasekhar Rao on World Telugu Conference.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి