'చంద్రబాబు సింప్లిసిటీ, కేసీఆర్ నేర్చుకోవచ్చు', ఏపీ సీఎంపై జగన్ విమర్శ ఇదే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం, తమ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నుంచి సింప్లిసిటీ నేర్చుకోవాలని తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీ సీఎం, తమ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నుంచి సింప్లిసిటీ నేర్చుకోవాలని తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు ఎద్దేవా చేశారు.
ఆదివారం నాడు చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడారు. ఓ వైపు రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ లగ్జరీ కోసం చూస్తున్నారని, చంద్రబాబులా సింప్లిసిటీ మెయింటెయిన్ చేయాలన్నారు.

గ్రామీణ పేదలకు రాజకీయం నేర్పి సమర్థమైన నాయకత్వాన్ని తయారుచేసిన పార్టీ టిడిపి అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే టిడిపి లక్ష్యమని చెప్పారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటి వరకూ మధిర నియోజకవర్గం అత్యధిక సభ్యత్వాలతో అగ్రస్థానంలో ఉందన్నారు. మిగతా చోట్ల కూడా ఇలాగే నమోదు చేయించాలన్నారు.
ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు వాటిని మరిచిపోయారని టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించలేదని, సీఎం కేసీఆర్ భారీ వ్యయంతో ఇల్లు కట్టుకుని నవాబులా వ్యహరిస్తున్నారన్నారు.
కాగా, చంద్రబాబు తెలంగాణలో సచివాలయం ఉన్నప్పుడు తన చాంబర్‌కు కోట్లాది రూపాయలు వెచ్చించారని, అమరావతిలోను తాత్కాలిక సచివాలయం పేరుతో డబ్బులు వృథా చేస్తున్నారని ఏపీలో వైసిపి ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications