వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబూ! ఏపీ ప్రజలు బొందపెడతారు, ఎన్టీఆర్‌ను చంపి..: మోత్కుపల్లి

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఏపీ సీఎం చంద్రబాబుపై మోత్కుపల్లి ధ్వజం

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అని అన్నారు. మంగళవారం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు.

ప్రపంచంలో చంద్రబాబు అంత నీచుడు లేడని తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబును ఎప్పుడో సస్పెండ్ చేశారని మోత్కుపల్లి అన్నారు. ఏపీలో కూడా చంద్రబాబును బొంద పెట్టడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.పార్టీ నేతలకు ఇబ్బంది వస్తే ఆదుకోలేదని అన్నారు.

 ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుంటూ..

ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుంటూ..

చంద్రబాబు ఓ దొంగ అని, తనకు చేసిన అన్యాయానికి చంద్రబాబు మనస్సాక్షే అతనికి బుద్ధి చెబుతుందని అన్నారు. తనను చంద్రబాబు ఎందుకు తిట్టడం లేదని.. ఇతర నేతలెందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుంటున్నారు తప్ప, ఎలాంటి పదవులు ఇవ్వడం లేదని చంద్రబాబుపై మండిపడ్డారు మోత్కుపల్లి.

 మోడీ కాళ్లు పట్టుకున్నాడు.. ఏపీ కోసం కాదు

మోడీ కాళ్లు పట్టుకున్నాడు.. ఏపీ కోసం కాదు

హైదరాబాద్‌లో రెండు బిల్డింగులు కట్టి గొప్పలు చెప్పుకున్నాడని, అమరావతిలో కూడా రెండు బిల్డింగులు కట్టి గొప్పలు చెప్పుకుంటాడని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రధాని మోడీ దగ్గరకు 29సార్లు వెళ్లింది.. ఏపీ ప్రజల కోసం కాదని, అతని కేసుల మాఫీ కోసమేనని మోత్కుపల్లి చెప్పారు. ఇందుకోసం మోడీ కాళ్లు పట్టుకున్నారని అన్నారు.

 మాట మార్చిన బాబు

మాట మార్చిన బాబు

పెద్ద నోట్ల రద్దు సలహా ఇచ్చింది తానేనని చంద్రబాబు చెప్పుకుంటారని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే చంద్రబాబు అసెంబ్లీ తీర్మానం చేసి మోడీని పొగిడిందెవరని మోత్కుపల్లి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏమైనా బ్రహ్మ పదార్థమా? అని చంద్రబాబు అనలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు ప్యాకేజీ కావాలని, ఇప్పుడు హోదా పాట పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, తన మంత్రులు అందరూ రాజీనామా చేసివుంటే హోదా, ప్యాకేజీ వచ్చేదని మోత్కుపల్లి అన్నారు.

 మిత్ర ద్రోహి

మిత్ర ద్రోహి

మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పవన్ కళ్యాణ్‌ను కూడా చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా చంద్రబాబు కాకుంటే.. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, సీపీఐ, సీపీఐ తెస్తాయని అన్నారు. చంద్రబాబు డబ్బుల రాజకీయం చేస్తున్నారని, చంద్రబాబు పెట్టినంత ఖర్చు ఏ పార్టీ కూడా పెట్టదని అన్నారు. చంద్రబాబు ప్రజావ్యతిరేకి అని, అద్దాల మేడల్లో ఉంటాడు, ప్రత్యేక విమానాల్లో తిరుగుతాడని అన్నారు.

 ఎన్టీఆర్‌కు భారతరత్న ఇష్టం లేకనే..

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇష్టం లేకనే..

వాజ్‌పాయి, దేవెగౌడలను ప్రధానులను చేసింది తానేనని చెప్పుకునే చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారతరత్నను ఎందుకు ఇప్పించుకోలేదని మోత్కుపల్లి ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు మంచి పేరు రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని, అందుకే ఇలా చేశారని అన్నారు. ఎన్టీఆర్ హత్య చేసి, ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఇంకా చంపుతూనే ఉన్నారని బాబుపై మండిపడ్డారు.

 ఏపీ ప్రజలు బొందపెడతారు

ఏపీ ప్రజలు బొందపెడతారు

ఏపీ ప్రజలు చంద్రబాబును రాజకీయంగా బొంద పెడతారని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబు ఎన్నో వేల కోట్లు సంపాదించారని, దేశంలో అన్ని కంపెనీలకు నష్టం వచ్చినా హెరిటేజ్ కు మాత్రం లాభాలే వస్తాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారని అన్నారు.

చంద్రబాబుకు ఓటేయ్యొద్దు

చంద్రబాబుకు ఓటేయ్యొద్దు

చంద్రబాబు అన్ని కులాల మధ్య చిచ్చుకుపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మోత్కుపల్లి చెప్పారు. ఎన్టీఆర్‌పై భక్తి ఉన్నవారు ఎవరూ కూడా చంద్రబాబుకు ఓటు వేయకూడదని అన్నారు. తాను ఎప్పుడూ నర్సింహస్వామిని పూజిస్తానని, ఇప్పుడు తిరుమల వెంకటేశ్వరస్వామిని కూడా చంద్రబాబును ఓడించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు లాంటి దొంగల పక్షాన ఉండొద్దని వెంకన్నును కోరుతున్నానని అన్నారు.

నమ్మక ద్రోహం

నమ్మక ద్రోహం

చంద్రబాబు తనకు నమ్మక ద్రోహం చేశారని మోత్కుపల్లి మండిపడ్డారు. అధికారంలో ఉన్నా లేకున్నా తాను పార్టీ కోసం పనిచేశానని అన్నారు. విభజన సమయంలో చంద్రబాబు కాపాడమని కోరితే తాను ఆయన వెంట ఉన్నానని చెప్పారు. తాను గవర్నర్ పదవి గానీ రాజ్యసభ సీటు గానీ అడిగానా? అని మోత్కుపల్లి ప్రశ్నించారు. పనికిమాలిన నేతలతో తనను తిట్టిస్తున్నావని మోత్కుపల్లి మండిపడ్డారు.

English summary
Telangana TDP leader Motkupalli Narasimhulu lashes out at Andhra Pradesh CM and TDP president Chandrababu Naidu for his suspension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X