రాజ్యసభకు మోత్కుపల్లి..!! సీఎం కేసీఆర్ కసరత్తు - పెద్దల సభకు వెళ్లేదెవరు..!!
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లే పెద్దలెవరు. మరో కొద్ది నెలల్లో తెలంగాణ నుంచి రాజ్యసభలో ముగ్గురు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో..ఆ మూడు స్థానాలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్ కు దక్కనున్నాయి. ఇక, ఎమ్మెల్సీల ఎన్నికల హడావుడి ముగియటంతో ఇప్పుడు రాజ్యసభ పైన ఆశావాహుల చూపు పడింది. తాజాగా ఎమ్మెల్సీ నియామకాల్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేసి..ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉన్నవి మూడు సీట్లే అయినా.. పోటీ మాత్రం ఎక్కువగా ఉంది.

రాజ్యసభకు పెరుగుతున్న పోటీ
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ లో డి. శ్రీనివాస్..కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం పూర్తవుతుంది. ఈ ఇద్దరితో పాటుగా బండ ప్రకాశ్ సీటు సైతం ఒకే సారి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ మూడు స్థానాల్లో ఒక ఎస్సీ - బీసీ - ఓసీ వర్గాలకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అందులో ప్రధానంగా కరీంనగర్ మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కు ఈసారి రాజ్యసభ పక్కా అంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వినోద్ కుమార్ కు ఖాయంగా
కేంద్రం - తెలంగాణ ప్రభుత్వం మధ్య సమన్వయకర్తగా పని చేసేందుకు వినోద్ సేవలు వినియోగించుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలోనే ఎంపీగా పని చేసిన అనుభవం.. కేంద్ర ప్రభుత్వ పని తీరు పైన అవగాహన ఉన్న వ్యక్తి కావటంతో పాటుగా పార్టీలో కీలకంగా ఉండటంతో..ఆయన సేవలను ఈ సారి రాజ్యసభకు అవకాశం కల్పించి వినియోగించుకోవటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మిగిలిన స్థానాల కోసం ఎంపీ సీతారాం నాయక్‌తో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నారు.

మోత్కుపల్లికి సైతం ఛాన్స్
వీరితో పాటుగా ఎమ్మెల్సీగా అవకాశం కోసం నిరీక్షించి.. రాకోవటంతో ఇప్పుడు రాజ్యసభకు అయినా అవకాశం దక్కించు కోవాలనే ఆశతో మరి కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఎర్రోళ్ల శ్రీనివాస్, కర్నె ప్రభాకర్ సైతం ప్రముఖంగా రేసులో ఉన్నారు. ఇక, కొద్ది కాలం క్రితం టీఆర్ఎస్ లో చేరిన సీనియర్ పొలిటిషీయన్ మోత్కుపల్లి నర్సింహులు పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం దళితబంధు ద్వారా మరింతగా దళిత వర్గాలకు దగ్గరయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. తన కార్యాలయంలో అధికారుల నియామకంలోనూ మార్పులు చేసారు.

కేసీఆర్ అంచనాలు భిన్నంగా
ఇప్పుడు, పార్టీ నుంచి దళిత వర్గానికి చెందిన వారికి మరింత ప్రాధాన్యత కల్పించాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం సాగింది. అయితే, టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన బీసీ నేత ఎల్ రమణ కు ఎమ్మెల్సీ ఇవ్వటంతో..ఇప్పుడు మోత్కుపల్లికి పెద్దల సభకు పంపుతారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ పదవి వస్తుందని ఆశించారు. కానీ, అది సాధ్యపడలేదు.
Recommended Video

తుది జాబితాలో దక్కేదెవరికి
ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం ఖాయమని చెబుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి లెక్కలు..పూర్తిగా భిన్నంగా..ఎవరికీ అంతు చిక్కనివిగా ఉంటాయి. ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక విషయంలో కేసీఆర్ లెక్కలు చూసిన తరువాత.. రాజ్యసభలోనూ అదే తరహాలో ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో.. రాజ్యసభ ఎంపీల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది మరింత ఆసక్తి కరంగా మారుతోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications