మక్కామసీద్ మాజీ ఇమామ్ అబ్దుల్లా ఖురేషి కన్నుమూత
హైదరాబాద్: జామీయా నిజామీయా డిప్యూటీ వైస్ ఛాన్సలర్, మక్కా మసీద్ మాజీ ఇమామ్ హాఫీజ్ మౌలానా అబ్దుల్లా ఖురేషి అజ్హరీ(80) మంగళవారం కన్నుమూశారు.
కాగా, బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సుమారు 25ఏళ్లపాటు ఆయన మక్కా మసీదు ఇమామ్, కతీబ్‌గా సేవలందించారు. ఆయన ప్రసంగాలకు చాలా మంది ప్రశంసలు లభించాయి. ఆయన అనేక మంది విద్యార్థులకు బోధనలు చేశారు.












Click it and Unblock the Notifications