ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శవమైన తేలిన మౌనిక, వీడని మిస్టరీ: అంతు చూస్తానంటూ మెసేజ్

By Pratap
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ఖమ్మం మహిళా కాలేజీలో ఫైనలియర్ చదువుతున్న మౌనిక ఆదివారంనాడు తన ఊరికి వెళ్తున్నానని చెప్పి సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జిల్లా ఆస్పత్రిలో శవమైన కనిపించింది. ఆమె మృతి మిస్టరీ ఇంతవరకు వీడలేదు. ఈ కేసులో ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

19 ఏళ్ల భూక్యా మౌనిక మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకుని వచ్ిచ పారిపోయిన ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిలో ఒకరిని కూసుమంచి మండలం నాయకన్‌గూడేనికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. మౌనిక సెల్‌ఫోన్‌కు నీ అంతు చూస్తానంటూ వచ్చిన మెసేజ్‌పై పోలీసులు దృష్టి సారించారు.

మౌనిక తల్లిదండ్రులకు ఫోన్ చేసిన యువకుడి నెంబర్ నుంచే ఆ మెసేజ్ వచ్చినట్లు గుర్తించారు. అదే నెంబర్ నుంచి శనివారం రాత్రి మౌనిక సెల్‌కు దాదాపు 50 మిస్ట్ కాల్స్ వచ్చాయి .మౌనికకు చెందిన ఓ నోట్ బుక్కులో ఓ యువకుడి ఫొటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Mounika death mystery: Police search for an youth

ఆ ఫొటో మౌనికను ఆస్పత్రికి తీసుకుని వచ్చిన సందర్భంగా సిసిటీవీ కెమెరాల్లో కనిపించిన ఇద్దరు యువకుల్లో ఒకరిని పోలి ఉంది. దీంతో ఆ యువకుడికి మౌనిక మృతితో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్ారు. మౌనిక తరుచుగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేదని, అప్పుడప్పుడు ఓ యువకుడు మౌమిళ్లగూడెంలో ఆమె ఉంటున్న స్వధార్ హోంకు వచ్చేవాడని, అతడి పేరు రాము అని చెప్పిందని అంటున్నారు.

శనివారం సాయంత్రం ఓ యువకుడు గొడవ పడి మౌనికపై చేయి కూడా చేసుకున్నాడని, ఆ యువకుడు ఎవరని అడిగితే పేరు చెప్పకుండా మౌనిక ఏడవడం ప్రారంభించిందని అంటున్నారు. ఆమెను ఆస్పత్రికి తీసుకుని వచ్చిన యువకుల్లో ఒకతను మౌనిక తండ్రి రామచంద్రకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరి వేసుకుందని, జిల్లా ఆస్పత్రిలో చేర్పించామని చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు.

కొంత కాలంగా ఓ యువకుడు తనను ప్రేమించాలంటూ మౌనికపై వేధింపులకు పాల్పడుతున్నాడని, అతను సిసిటీవి ఫుటేజీలో ఉన్న యువకుడే అయి ఉండవచ్చునని పోలీసులు అంటున్నారు. వేధింపుల సంగతిని ఇటీవల ఆమె తన సోదరితో చెప్పి బాధపడినట్లుగా కూడా సమాచారం ఉంది.

జిల్లా ఆస్పత్రిలో మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. మృతదేహంపై పలు గాయాలున్నాయని అంటున్నారు. విద్యార్థిని మృతికి నిరసనగా కలెక్టరేట్ ఎదు మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

English summary
Khammam district police are searching for an youth in girl student Mounika's death case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X