హైడ్రాకు రూ. 25 లక్షలు కేటాయించిన ఎంపీ అనిల్ యాదవ్
హైదరాబాద్: చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రాపై ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ హైడ్రాను అభినందించారు. గురువారం బుద్ధభవన్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిశారు ఎంపీ అనిల్ యాదవ్.
హైడ్రా పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ అనిల్.. హైడ్రా కు తన ఎంపీ లాడ్స్ నుంచి 25 లక్షల రూపాయలు కేటాయించారు. 25 లక్షలు కేటాయిస్తూ లేఖను కమిషనర్ రంగనాథ్ కు అందజేశారు అనిల్ యాదవ్. కాగా, హైదరాబాద్ నగరంలోనీ చెరువులు కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారు. దానికి కమిషనర్‌గా మంచి అధికారిగా పేరున్న రంగనాథ్‌ను నియమించారు.

హైడ్రా పని తీరు అభినందిస్తూ.. హైడ్రా కు ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 25 లక్షలను రంగనాథ్‌కు అందజేశామని అనిల్ యాదవ్ తెలిపారు. పదేళ్లు అధికారంలో అన్న కేసిఆర్.. హైదరాబాద్ మహానగరంగా తీర్చి దిద్దుతమన్నారు. కానీ, హైదరాబాద్‌లోని అన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి. కనీసం ఒక్క చెరువును కూడా కాపాడలేక పోయారు. సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్ తరాల గురించి అలోచించి.. హైదరాబాద్ అద్భుతమైన నగరంగా ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారని ఎంపీ కొనియాడారు.
రాజకీయాల కోసం హైడ్రా అని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇది హైదరాబాద్ అభివృద్ధి కోసం చేస్తున్నారు. అనేక నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. అటువంటి ఇబ్బందులు రావద్దు అని ఈ కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. పదేళ్ల కింద అనేక చెరువులు నిండు కుండలా ఉండేవి.
అక్రమ కట్టడాలు చేపట్టిన వారు ఎవరు అయిన హైడ్రా వదిలిపెట్టదని ఎంపీ అనిల్ యాదవ్ చెప్పారు.
డ్రగ్స్ నివారణ విషయంలో కూడా సీఎం ప్రత్యే దృష్టి పెట్టారు. హైడ్రాను ఇతర జిల్లాలలో కూడా అమలు చేయాలని వినతులు ప్రభుత్వానికి అందుతున్నాయి.
జిల్లాలకు హైడ్రా విస్తరించాలి. హైడ్రా కు పూర్తి మద్దతు ఇస్తున్నామని ఎంపీ అనిల్ యాదవ్ చెప్పారు.












Click it and Unblock the Notifications