కాంగ్రెస్ తో దోస్తీ కోసం కేసీఆర్ దస్తీ; రేవంత్ జాగ్రత్త: ఎంపీ అరవింద్ సంచలనం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ పై అరవింద్ పిట్ట కథ చెప్పారు. దేవతా వస్త్రాల కథతో విమర్శనాస్త్రాలను సంధించారు ధర్మపురి అరవింద్.

 సర్జికల్ స్ట్రైక్ పై కేసీఆర్ వ్యాఖ్యలపై అరవింద్ ఫైర్

సర్జికల్ స్ట్రైక్ పై కేసీఆర్ వ్యాఖ్యలపై అరవింద్ ఫైర్


సీఎం కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎంపీ ధర్మపురి అరవింద్ . బాలకోట్ సర్జికల్ స్ట్రైక్ గురించి ప్రజలకు సమాచారం ఇచ్చింది భారత సైన్యం ఉన్నతాధికారులని పేర్కొన్న ఆయన సమాచారం ఇచ్చింది రాజకీయనాయకులు కాదంటూ వెల్లడించారు. దీనిపై రుజువులు చూపించాలని అడగడం సైన్యాన్ని కించపరచడమే అని ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు ఇక చైనా బోర్డర్ విషయంలో కూడా కెసిఆర్ ఇదేవిధంగా మాట్లాడారని, భారత సైన్యాన్ని హేళన చేయడం కెసిఆర్ కు అలవాటుగా మారిందని ధర్మపురి అరవింద్ మండిపడ్డారు.

Recommended Video

    KCR, DGP Mahinder Reddy పై తీవ్రపదజాలం తో విరుచుకుపడ్డ Dharmapuri Arvind | Oneindia Telugu
    రాజకీయాల్లోకి సైన్యాన్ని తీసుకురావద్దని అరవింద్ హితవు

    రాజకీయాల్లోకి సైన్యాన్ని తీసుకురావద్దని అరవింద్ హితవు

    ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ఈ దేశ సైన్యాన్ని బలోపేతం చేస్తున్నారని పేర్కొన్న ఆయన రాజకీయాల్లోకి సైన్యాన్ని తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. భారత దేశ సైన్యం అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోందని, మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా రక్షణ సామాగ్రిని దేశంలోనే తయారు చేసుకోగలుగుతుంది అని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

    కాంగ్రెస్ తో దోస్తీ కోసం దస్తీ వేస్తున్న కేసీఆర్ .. రేవంత్ జాగ్రత్త

    కాంగ్రెస్ తో దోస్తీ కోసం దస్తీ వేస్తున్న కేసీఆర్ .. రేవంత్ జాగ్రత్త


    కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేయడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ దస్తీ వేస్తున్నాడని, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీని కెసిఆర్ బుట్టలో వేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదివారం నాడు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన కెసిఆర్ బూతులు లేకుండా మాట్లాడినందుకు ముందు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కుల అహంకారంతో రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ మీద సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు.

    అరిగిపోయిన రికార్డులాగా మళ్లీ అవే అబద్ధాలు చెప్తున్న కేసీఆర్

    అరిగిపోయిన రికార్డులాగా మళ్లీ అవే అబద్ధాలు చెప్తున్న కేసీఆర్

    రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలని డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించలేదని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. దళితుల కోసం రాజ్యాంగం మార్చాలి అంటున్న కేసీఆర్ క్యాబినెట్ లో ఎంత మంది దళితులు ఉన్నారో చెప్పాలని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. ఇక కొత్త విద్యుత్ బిల్లుల గురించి అరిగిపోయిన రికార్డులాగా మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. విద్యుత్ డ్రాఫ్ట్ బిల్లులో మూడవ పేజీ క్లాజ్ 4.7లో చాలా క్లియర్ గా వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు అవసరంలేదని రాసి ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

     రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీలు ఆపమని కేంద్రం ఎక్కడా చెప్పలేదు

    రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీలు ఆపమని కేంద్రం ఎక్కడా చెప్పలేదు

    కేంద్రం తీసుకొచ్చిన బిల్లులో ఎక్కడా రాష్ట్రంలోని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఆపి ప్రైవేటు సంస్థల దగ్గర విద్యుత్తును కొనమని చెప్పలేదని, పైగా రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీని వాడుకొని విద్యుత్ శక్తిని పెంచుకోవాలి అనేది పేర్కొన్నారని, ఆ టెక్నాలజీని కూడా కేంద్రమే రాష్ట్రాలకు ఇస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీలు ఆపమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. రైతులు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు, గిరిజనులకు, దళితులకు ఎవరికైతే సబ్సిడీ ఇస్తున్నారో వాటన్నింటినీ కొనసాగించాల్సిందే అని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+