Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంపీ అరవింద్ పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోపం అందుకేనా ? ఆర్మూర్ పై ఎంపీ ఫోకస్ వెనుక పెద్ద కథే !!

నిజామాబాద్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయా? నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ వేస్తున్న అడుగులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి తలనొప్పిగా తయారయ్యాయా? నిజామాబాద్ ఎంపీ అరవింద్ భవిష్యత్తులో నిజామాబాద్ రాజకీయాలలో, అందునా రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న నేపథ్యంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎంపి వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా తయారయ్యాయా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది. అసలు ఇంతకీ నిజామాబాద్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఎంపీ అరవింద్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంతగా ఎంపీ ధర్మపురి అరవింద్ ను టార్గెట్ చేస్తున్నాడు ? అంటే దీని వెనుక ఆసక్తికర కథే ఉందని స్థానికంగా చర్చ జరుగుతుంది.

నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఫోకస్ .. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు

నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఫోకస్ .. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు


నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రానున్న ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా మారాలని ఇప్పటినుండే అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తున్నారు . సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కెసిఆర్ కు రెండో కొడుకు లాంటి వాడని వ్యాఖ్యానించారు . వచ్చే ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ మినహా ఆయన కుటుంబం మొత్తం విదేశాలకు పారిపోవడానికి ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న ఎంపీ అరవింద్ ను టార్గెట్ చేస్తున్న ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న ఎంపీ అరవింద్ ను టార్గెట్ చేస్తున్న ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి


ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు గొర్రెలు బర్రెలు అంటూ తిరుగుతున్న సీఎం ముందుగా ఆయన కొడుకుకు పది గొర్రెలు, కూతురికి పది బర్రెలు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. దళితులపై ప్రేమ చూపిస్తున్న సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఎన్నడూ నెరవేర్చలేదని వ్యాఖ్యానించారు. కేవలం హుజురాబాద్లో ఓటమి భయంతోనే దళిత బంధు లాంటి పథకాలు తీసుకొస్తున్నారని ఆయన సీఎం ను టార్గెట్ చేశారు . తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులలో ముంచిన కెసిఆర్ కుటుంబం దాదాపు రాష్ట్ర నిధుల నుండి 30 శాతం మేర దోచుకున్నారని ఆరోపించారు. ఆయన మాటలు చెప్పడం తప్ప చేతల్లో ఏది చేయరని విమర్శించారు. తాజాగా సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఎంపీ అరవింద్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు.

ఎంపీ అరవింద్ బిగ్ లోఫర్ అంటూ తిట్టిపోస్తున్న పీయూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి

ఎంపీ అరవింద్ బిగ్ లోఫర్ అంటూ తిట్టిపోస్తున్న పీయూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి

ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎంపీ అరవింద్ ను టార్గెట్ చేసి రివర్స్ ఎటాక్ చేశారు. ఇప్పటికే ఎంపీ అరవింద్ తీరుతో తీవ్ర అసహనంతో ఉన్న జీవన్ రెడ్డి ఇప్పుడు అరవింద్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీ అంటే బిగ్ లోఫర్ పార్టీ అని, ఆ పార్టీ ఎంపీ అరవింద్ బిగ్ లోఫర్ అని జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు . పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై రాసిన ఫేక్ ఎంపీ అరవింద్ అంటూ మండిపడ్డారు. దమ్ముంటే ప్రధాని మోడీ తో మాట్లాడి పసుపు బోర్డు తీసుకురావాలని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు పాదయాత్ర చేసిన మోకాళ్ల మీద నడిచినా రాష్ట్రంలో అధికారం దక్కదని తేల్చి చెప్పారు. ఎంపీ అరవింద్ చెత్తమాటలు మానుకోవాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ ను అనే స్థాయి ఎంపీ అరవింద్ కు లేదని నిప్పులు చెరిగారు.ఒకే ఇంట్లో మూడు పార్టీలు ఉన్న అరవింద్ ముందు ఇంట గెలవకుండా రచ్చ గెలుస్తాడా అంటూ ఎద్దేవా చేశారు.

జీవన్ రెడ్డి ఎంపీ అరవింద్ ను టార్గెట్ చెయ్యటం వెనుక బలమైన కారణం ఇదే

జీవన్ రెడ్డి ఎంపీ అరవింద్ ను టార్గెట్ చెయ్యటం వెనుక బలమైన కారణం ఇదే

ఎంపీ అరవింద్ పై ఇంతగా టార్గెట్ చేస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి వ్యాఖ్యల వెనక అరవింద్ చేసిన వ్యాఖ్యలే కాదు, మరో బలమైన కారణం కూడా ఉందని తాజాగా చర్చ జరుగుతుంది. ఆర్మూరు నియోజకవర్గంపై ఫోకస్ పెడుతున్న ధర్మపురి అరవింద్ ఆర్మూరులో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ లేదా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగాలని ధర్మపురి అరవింద్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా ధర్మపురి అరవింద్ తన ఇంటిని కూడా ఆర్మూర్ కి షిఫ్ట్ చెయ్యాలని నిర్ణయం తీసుకోవటం వెనుక మతలబు అదే అని ప్రచారం జరుగుతుంది.

 పసుపు బోర్డు అంశాన్ని తెచ్చి ఎంపీని టార్గెట్ చేస్తున్న జీవన్ రెడ్డి .. నిజామాబాద్ జిల్లాలో చర్చ

పసుపు బోర్డు అంశాన్ని తెచ్చి ఎంపీని టార్గెట్ చేస్తున్న జీవన్ రెడ్డి .. నిజామాబాద్ జిల్లాలో చర్చ

ఈ క్రమంలోనే ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రధానంగా ధర్మపురి అరవింద్ ను టార్గెట్ చేస్తున్నారు. తన నియోజకవర్గంలో పావులు కదుపుతున్న ధర్మపురి అరవింద్ పై నిప్పులు చెరుగుతున్నారు. పసుపు బోర్డు అంశాన్ని ప్రధానంగా తీసుకువచ్చి ధర్మపురి అరవింద్ ను ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. హిందువులకు పవిత్రమైన పసుపు తోనే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజకీయం చేశారని టార్గెట్ చేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ వర్సెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నట్టుగా మారిన పరిస్థితి వెనుక భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలు ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో వీరిద్దరూ నిజామాబాద్ జిల్లా రాజకీయాలలోఎమ్మెల్యేలుగా తలపడనున్నారు అన్న చర్చ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+