కేసీఆర్‌తో ఓవైసీ భేటీ: 'ముస్లీం సమ్మేళనానికి సహకరిస్తాం', బక్రీద్ సెలవు 25న

హైదరాబాద్: సోమవారం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కలిశారు. నవంబర్ 21న రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో జరిగే అఖిల భారత ముస్లిం సమ్మేళన కార్యక్రమం జరుగుతుందని, దీనికి ప్రభుత్వం సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మస్లింపు పాల్గొంటారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎంను కోరారు. ఇందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ముస్లింల మహాసభకు మంచినీటి సరఫరా, నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

షాహీన్‌నగర్ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 21 నుంచి మూడు రోజులపాటు ఈ ముస్లిం సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు.

MP Asaduddin Owaisi meets cm kcr over muslim sammelanam

బక్రీద్ సెలవు 25న

ముస్లింల పవిత్ర పండగ బక్రీద్ సెలవులో మార్పులు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అధికారిక పండగ సెలవు క్యాలెండర్లో బక్రీద్ సెలవును సెప్టెంబర్ 24గా పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

బక్రీద్ సందర్భంగా సెప్టెంబర్ 25న అధికారిక సెలవు దినంగా పేర్కొంటూ అదేశాలు జారీ చేశారు. ఈనెల 24కు బదులుగా 25న బక్రీద్ సెలవు దినాన్ని ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 25న ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+