హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళ పారిశ్రామికవేత్తలకు ఊతం ఈ ‘ఏంజిల్’ సమ్మిట్: ఎంపి కవిత(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళా పారిశ్రామికవేత్తలు తమ ప్రతిభను చాటుకునేందుకు ఏంజిల్ సమ్మిట్- 2015 అత్యుత్తమ వేదిక అని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. స్టార్టప్‌లకు ఊతమిచ్చే విధంగా ఏర్పాటు చేయనున్న ఏంజిల్ సమ్మిట్‌కు హైదరాబాద్ వేదిక కావడం సంతోషకరమన్నారు.

నవంబర్‌ 28న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)లో జరుగనున్న ఏంజిల్ సమ్మిట్‌కు సంబంధించిన వివరాలను తెలిపేందుకు మంగళవారం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని టి-హబ్ భవనంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ఎంపీ కే కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే, వ్యాపారంలో నిలదొక్కుకోవాలనుకునే వారికి ఏంజిల్ సమ్మిట్ చక్కటి ప్లాట్‌ఫాం అని అన్నారు. పలు రంగాల్లో మహిళలు ప్రతిభ చాటేందుకు సిద్ధమవుతున్నారని, అలాంటి స్టార్టప్‌ల సత్తాను ప్రపంచానికి చాటేందుకు ఇన్వెస్టర్లు ముందుకురావడం అభినందనీయమని అన్నారు.

ఈ క్రమంలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా సదస్సును ఏర్పాటు చేయడం ఎందరో ఆడబిడ్డలకు ధైర్యాన్నిస్తున్నదని కవిత పేర్కొన్నారు. ఇలాంటి వైవిధ్యమైన సదస్సుకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎన్నుకోవడం సంతోషకరమన్నారు.

ఈ సదస్సు ద్వారా మరింత మంది మహిళా ఔత్సాహికులకు వారి కలలను సాకారం చేసుకొనేందుకు అవకాశం దొరుకుతుందని చెప్పారు. వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహమందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం టీ హబ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిందని చెప్పారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

మహిళా పారిశ్రామికవేత్తలు తమ ప్రతిభను చాటుకునేందుకు ఏంజిల్ సమ్మిట్- 2015 అత్యుత్తమ వేదిక అని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

స్టార్టప్‌లకు ఊతమిచ్చే విధంగా ఏర్పాటు చేయనున్న ఏంజిల్ సమ్మిట్‌కు హైదరాబాద్ వేదిక కావడం సంతోషకరమన్నారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

నవంబర్‌ 28న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)లో జరుగనున్న ఏంజిల్ సమ్మిట్‌కు సంబంధించిన వివరాలను తెలిపేందుకు మంగళవారం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఎంపి కవిత

ఎంపి కవిత

హైదరాబాద్‌లోని టి-హబ్ భవనంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ఎంపీ కే కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఓ పక్క పాలనపరంగా ప్రత్యేకతలు చాటుకుంటూనే కొత్త రంగాల్లో పలు అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా తెలంగాణ రాష్టం అడుగులేస్తున్నదని తెలిపారు. మహిళలకు అండగా నిలువడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని చెప్పారు. సదస్సు నిర్వాహకులను ఈ సందర్భంగా ఎంపీ కవిత అభినందించారు.

అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. కొత్త, వినూత్న ఆలోచనలు ఉన్నవారిని ప్రోత్సహించేందుకు ఈ సదస్సును ఏర్పాటుచేశామని, వ్యాపార, వాణిజ్య, సామాజిక రంగాలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఈ సదస్సులో అంతర్జాతీయ బాక్సర్ మేరీకోమ్, ఎంపి కవిత, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖుల స్ఫూర్తి ప్రసంగాలు ఉంటాయని పేర్కొన్నారు.

English summary
Nizamabad MP Kalvakuntla Kavitha on Tuesday participated in Angel summit-2015's meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X