టీమిండియా ఓటమిపై... ఎంపీ కవిత వెరైటీ ట్వీట్, వైరల్ అవుతున్న ఇమేజ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కర్ణుడి చావుకు కోటి కారణాలన్నట్లు.. టీమిండియా ఓటమికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు. ఛాంపియన్స్ టోఫ్రీ ఫైనల్లో దాయాదులపై టీమిండియా ఓడిపోడాన్ని భారత క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

చదవండి: కేసీఆర్ కాపలా కుక్క, మోసగాడు: విరుచుకుపడిన పొన్నాల

నెటిజనులైతే వంగ్యాస్త్రాలతో తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి తోచిన కారణాన్ని వాళ్లు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఎంపీ కవిత కూడా ఈ విషయంపై సోషల్‌మీడియాలో స్పందించారు.

MP Kavita's variety tweet on the defeat of team india

బాగా వైరల్ అవుతున్న ఓ కార్టూన్‌ను కవిత తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'ప్రస్తుతం జనాల మూడ్ ఇలా ఉంది' అని క్యాప్షన్ పెట్టారు. ఓ వ్యక్తి బాగున్న క్రికెట్ బ్యాట్‌ను కత్తితో చెక్కి చెక్కి చివరికి దాన్ని హాకీ బ్యాటుగా మార్చి తీసుకెళుతున్న దృశ్యం ఆ కార్టూన్ లో మనకు కనిపిస్తుంది.

కింద.. ఆఫ్టర్ ఆల్, అవర్ నేషనల్ గేమ్ ఈజ్ హాకీ.. అనే స్లోగన్ కూడా రాసి ఉంటుంది. అంటే మనకు ఎన్ని క్రీడలు ఉన్నా.. మన జాతీయ క్రీడ హాకీ అనే విషయాన్ని మరువకూడదని, దానికి ప్రాముఖ్యత ఇస్తే బాగుంటుందని ఆ కార్టూన్ ఉద్దేశం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MP Kavitha Kalvakuntla posted a variety comment in her official twitter account about team india's latest defeat on pakistan.
Please Wait while comments are loading...