ఆరడుగుల బుల్లెట్ అంటే ఆయనే: హరీశ్‌పై ఎంపీ కవిత
హైదరాబాద్: తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి హరీశ్ రావుని ఆరడుగుల బుల్లెట్‌గా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అభివర్ణించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాలకవర్గం సభ్యులు మంత్రి హరీశ్‌రావు వెంటపడి నిధులు తెచ్చుకోవాలని సూచించారు.

మార్కెట్‌శాఖలో వినూత్న పథకాలు ప్రవేశపెడుతూ రైతులకు అండగా నిలుస్తున్న ఆరడుగుల బుల్లెట్ మంత్రి హరీశ్‌రావు అని అన్నారు. పంట ఉత్పత్తుల అమ్మకంలో రైతులకు, నిధుల మంజూరులో మార్కెట్ కమిటీలకు ఎలాంటి ఢోకా ఉండబోదని స్పష్టం చేశారు.
మార్కెట్ కమిటీలు రైతులకు అండగా ఉండి, యార్డులను దేవాలయాలుగా మార్చాలని ఆమె కోరారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పనిచేసిన వారికి పదవులు దక్కాయని, మరికొంత మందికి పదవులు రావాల్సి ఉందని అన్నారు. క్రమశిక్షణతో పనిచేసిన వారికి టీఆర్‌ఎస్ పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications