ఓటుకు నోటు: 'తప్పు అంగీకరించిన బాబు', విచారణ తప్పదని కవిత
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్లుగా అంగీకరించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురువారం నాడు అన్నారు. ఆయన తప్పు చేయకుంటే క్వాష్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు.
వైసిపి ఎమ్మెల్యే అక్కడకెళ్లడమేంటి: ఓటుకు నోటుపై హైకోర్టుకు బాబు, కొంత ఊరటఈ కేసుకు సంబంధించి తనకు ఇబ్బంది వస్తుందని చంద్రబాబుకు అర్థమైందన్నారు. హైకోర్టుకు వెళ్లడం ద్వారా తాను తప్పు చేశానని ఆయననే నిర్ధారించినట్లుగా తేలిందని చెప్పారు. గతంలో అనేక కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకొని బయటపడ్డ చరిత్ర అన్నారు.

ఇప్పుడు ఓటుకు నోటు కేసులోను ఆయన అదే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విచారణ జరిగితే వాస్తవాలు బయటపడతాయని ఆయనకు భయం ఉందా అని నిలదీశారు. ఎలాంటి తప్పు చేయకుంటే విచారణకు సహకరించాలని ఆయన హితవు పలికారు.
శిక్ష తప్పదు: కవిత
ఓటుకు నోటు కేసుపై తెరాస నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం స్పందించారు. ఎంతటి వారికైనా విచారణ తప్పదన్నారు. ఇటువంటి కేసుల్లో చట్టాలు కఠినంగానే వ్యవహరిస్తాయన్నారు.
కేసులోని అంశాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. కేసులో నిజానిజాలను రాబట్టడానికి ఏసీబీ కేసుకి సంబంధించిన వారందరినీ విచారిస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications