మలేసియాలో చంద్రబాబును పొగిడిన ఎంపీ కవిత (పిక్చర్స్)

మెదక్: ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా అందరు కలిసి ఉండాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మలేసియాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు ప్రజలు, కార్మికుల స్థితిగతులసై అధ్యయనం చేస్తామని చెప్పారు. శనివారం మలేసియాలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో దార్శనికత కలిగిన ముఖ్యమంత్రులున్నారని, వారి సహకారంతో తెలుగు సంస్కృతిని కాపాడుకుందామన్నారు. మలేసియా సర్కారు ఉగాది పండుగను ఘనంగా నిర్వహించినందుకు ఆ దేశ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో మలేసియా ప్రధాని మహ్మద్‌ నజీబ్‌ తున్‌ హాజీ అబ్దుల్‌ రజాక్‌, మండలి బుద్ధప్రసాద్‌, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మలేసియా తెలుగు సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ అచ్చెయ్య ప్రసాద రావు, వరంగల్‌ కార్పొరేటర్‌ దాస్యం విజయ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

 కవిత

కవిత

తెలుగులోని కస్తూరి వాసన చక్కర పాకం. అరవ భాషలోని అమృతరాశి, కన్నడంలోని కస్తూరి వాసన అంటూ ఇతర భాషల్లోని గొప్పదనాన్ని తనలో ఇమిడింపజేసుకున్న గొప్పదనం తెలుగుభాషదని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో మలేషియా తెలుగు సంఘం ఉగాది సంబురాలను శనివారం ఘనంగా నిర్వహించింది.

 కవిత

కవిత

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత తెలుగుభాష గొప్పదనాన్ని, విశిష్టతను ఇలా కవిత రూపంలో వినిపించారు. మలేషియాలోని తెలుగు వారందరికీ దుర్మిఖి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ సుఖ సంతోషాలు కలగాలని కవిత ఆకాంక్షించారు. ఉగాది అంటే ఒక యుగాన్ని ప్రారంభించిన రోజుగా... బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించిన పవిత్రమైన రోజు అని చెప్పారు.

 కవిత

కవిత

ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా ఉగాది పండుగ రోజు రెండు విషయాలు మర్చిపోరు. ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించడం మొదటిది అయితే, భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం రెండోది అన్నారు. తెలుగు ప్రజల ఉన్నతికి అన్ని విధాల సహకారం అందిస్తామని ఎంపీ కవిత అన్నారు. తెలుగు భాషను గత 150 ఏళ్లుగా కాపాడుకొనేందుకు మలేషియాలోని తెలుగువారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

 కవిత

కవిత

మలేషియాలోని తెలుగు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపాడుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. మలేషియాలోని తెలుగు కార్మికులను వారి స్థితిగతులను అధ్యయనం చేసేందుకు హోంమంత్రి ఇక్కడి వచ్చారని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల్లోని సీఎంలు సైతం తెలుగువారిని కాపాడుకునేందుకు సహకరిస్తారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆశావహ ధృక్పథంతో ముందుకెళ్తున్నారని.. వారి సహకారంతో తెలుగువారిని కాపాడుకుంటామన్నారు.

 కవిత

కవిత

తెలుగు సినిమాలపై మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో విలువలు పడిపోతున్నాయి. ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడుతుండటం బాధాకరమే అయినా, మలేషియాలోని తెలుగువారు తెలుగు సినిమాలు చూసి భాషను నేర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాషను విదేశాల్లో నిలబెడుతున్న తెలుగు సినిమాలు వర్ధిల్లాలి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+