భవిష్యత్ నిర్ణయం తేల్చి చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక నిర్ణయం వెల్లడించారు. ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీలో పదవి దక్కలేదు. తాజాగా టీపీసీసీ సిఫార్సుల మేరకు ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీలను ప్రకటించింది. దాదాపు ఎంపీలు - ఎమ్మెల్యేతో పాటుగా సీనియర్లు పలు కమిటీల్లో అవకాశం కల్పించారు. కానీ, ఏ కమిటీలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రం అవకాశం కల్పించలేదు. దీని పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తన నిర్ణయం ఏంటో స్పష్టం చేసారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో వెంకటరెడ్డి ఏం చేయబోతున్నారనే అంశానికి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.

కోమిటిరెడ్డి వెంకటరెడ్డికి ఉద్దేశ పూర్వకంగానే
కాంగ్రెస్ పార్టీ తాజాగా టీపీసీసీకి జంబో కమిటీలను ప్రకటించింది. అందులో సహచర ఎంపీలు..సీనియర్లకు అకవాశం కల్పించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశ పూర్వకంగానే పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యేగా 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసారు. ఆ సమయంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంటకరెడ్డి మునుగోడులో ప్రచారం చేయలేదు. అదే సమయంలో కాంగ్రెస్ కు గెలిచే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి తమ్ముడికి మద్దతివ్వాలని కోరారు. దీని పైన కాంగ్రెస్ అధినాయకత్వం షోకాజు నోటీసులు ఇచ్చింది. దీనికి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. రాహుల్ తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేస్తున్నా..హైదరాబాద్ లోనే ఉన్నా వెంకటరెడ్డి అందులో పాల్గొనలేదు. దీంతో, అసలు వెంటకరెడ్డి కాంగ్రెస్ లో ఉండరని..త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకుంటారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ క్రమంలో తాజాగా పార్టీ పదవుల్లోనూ వెంకటరెడ్డిని పక్కన పెట్టారు.

నల్గొండ నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటన
ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఎన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే, ప్రస్తుతం భువనగిరి ప్రజలు ఎంపీగా ఎన్నుకోవటంతో ఎంపీగా ఆ నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తానని స్పష్టం చేసారు. అదే సమయంలో ఢిల్లీలో చాలా హైపవర్ కమిటీలు కాంగ్రెస్ లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. తనకు పదవులు కాదని, కార్యకర్తలు ముఖ్యమని వెంకటరెడ్డి స్పష్టం చేసారు. తాను గతంలో మంత్రి పదవికే రాజీనామా చేసానని గుర్తు చేసారు. ఇప్పుడు తాను రాజకీయాల గురించి మాట్లాడనని.. ఎన్నికలకు నెల ముందు మాత్రమే మాట్లాడుతానని గతంలోనే చెప్పానని, ఇప్పడుు అందుకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసారు. పార్టీ తనకు పదవులు ఇవ్వకపోవటం పైన లోలోపల ఆగ్రహం ఉన్నా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవులు తనకు లెక్క కాదనే విధంగా వ్యవహరిస్తున్నారు. నల్గొండ పరిధిలో తిరిగి వరుస పర్యటనలు..సమావేశాలకు సిద్దం అవుతున్నారు.

నియోజవకర్గం ఓకే .. ఏ పార్టీ నుంచి పోటీ
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. రాజగోపాల్ రెడ్డి సైతం మునుగోడు ఉప ఎన్నికల వేళ పలు మార్లు వెంకటరెడ్డి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోల్డ్ వార్ నడుస్తోంది. రేవంత్ సారధ్యంలో వెంకటరెడ్డి పని చేసే అవకాశాలు కనిపించటం లేదు. ఎన్నికల సమయానికి రేవంత్ పీసీసీ చీఫ్ గా కొనసాగుతారు. అదే సమయంలో..రాజగోపాల్ ఉప ఎన్నికల్లో ఓడిన కారణంగా..పార్టీ మార్పు గురించి బయటక పడటం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఎన్నికలకు నెల ముందు రాజకీయాలు మాట్లాడుతానని చెప్పటం వెనుక భారీ వ్యూహమే దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు వెంకటరెడ్డి వచ్చే ఎన్నికల కోసం నల్గొండలో తిరిగి ఫోకస్ చేసారు. కానీ, కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తారా మరో పార్టీ వైపు అడుగులు వేస్తారా అనేది స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఎటవంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రమే.












Click it and Unblock the Notifications