స్థలం గొడవ: మహిళను కాలితో తన్నిన ఎంపీపీ, వీడియో వైరల్

Recommended Video

    మహిళను కాలితో తన్నిన ఎంపీపీ, వీడియో వైరల్

    నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయిలో దారుణం జరిగింది. ఓ ఎంపీపీ మహిళను కాలితో తన్నాడు. స్థలం విషయంలో ఈ గొడవ జరిగింది. ఓ కుటుంబానికి, ఎంపీపీకి మధ్య ఘర్షణ జరిగింది. బాధిత మహిళ ఏదో చెబుతుండగా ఎంపీపీ అందరూ చూస్తుండగా కాలితో తన్నాడు.

    స్థలం రిజిస్ట్రేషన్‌ అనంతరం ఎంపీపీ అదనంగా డబ్బులు అడిగాడని బాధితురాలైన గౌరారం వాసి రాజవ్వ ఆరోపించారు. దీంతో ఆమె తమ బంధువులతో ఎంపీపీ ఇంటి ముందు నిరసనకు దిగింది. ఎంపీపీతో వారు వాగ్వాదానికి దిగారు.

    ఈ క్రమంలో రాజవ్వ ఎంపీపీని చెప్పుతో కొట్టింది. దీంతో ఎంపీపీ మహిళను కాలితో తన్నాడు. అనంతరం బాధితురాలి బంధువులు ఎంపీపీని అక్కడి నుంచి తోసివేశారు. మహిళను ఎంపీపీ కాలితో తన్నిన దృశ్యాలు మీడియాలో వైరల్‌గా అయ్యాయి.

    మహిళ తెలిపిన వివరాల మేరకు ఇందల్ వాయి వద్ద జాతీయ రహదారి పక్కన ఎంపీపీ గోపికి చెందిన స్థలం ఉంది. అందులో ఇల్లు కూడా 50 లక్షలకు ఇస్తానని చెప్పాడ. రూ.33.72 లక్షలకు ఒప్పందం కుదిరింది. డబ్బు మొత్తం చెల్లించి రిజిస్ట్రేన్ పూర్తయ్యాక 11 నెలలుగా ఇల్లు ఇల్లు, వ్యవసాయ భూమి ఖాళీ చేయలేదు.

    MPP Kicked Woman in Dharpally of Nizamabad

    అదనంగా డబ్బులు చెల్లించాలని ఎంపీపీ డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన ఇంటికి వచ్చి ఇంట్లోని సామానును ఎంపీపీ బయటపడేశాడు. పోలీసులు కూడా ఏం చేయలేకపోయారని చెప్పారు. తాను మాజీ నక్సలైట్‌ను అని, తనతో పెట్టుకోవద్దని అతను బెదిరిస్తున్నారని చెప్పారు. తన కొడుకులకు ఏం జరిగినా అతనిదే బాధ్యత అన్నారు. ఎస్సై, సీపీ, సీఐ, కలెక్టర్, ఎమ్మెల్యేలను కలిసి చెప్పుకుంటే తమను ఉండేందుకు అనుమతించారని, అయినా తమకు అన్యాయం జరిగిందన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+