రేవంత్ ముందు భారీ టాస్క్- మంద కృష్ణ, మోత్కుపల్లి భేటీ

Revanth Reddy: ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తుది తీర్పు తరువాత కీలక పరిణామాలు ఏర్పడుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి బుధవారమే భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై రాష్ట్రాలు ముందుకు వెళ్లకూడదని డిమాండ్ చేసింది.

రిజర్వేషన్లల్లో ఇప్పుడు ఉన్న కోటాను యథాతథంగా కొనసాగించాలని, ఇందులో ఎలాంటి మార్పులూ చేయకూడదని పట్టుబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దశాబ్దాల కాలం పాటు పోరాటం సైతం చేసింది.

MRPS leader Manda Krishna Madiga met Revanth Reddy

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలు ఏ,బీ,సీ,డీగా వర్గీకరించవచ్చంటూ ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది.

దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘకాలంగా పోరాటం సాగిస్తూ వస్తోన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ.. ఈ తీర్పును స్వాగతించారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పడం తమ పోరాటానికి నిదర్శనమని అన్నారు.

వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేయడానికి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో తాము అన్ని రాష్ట్రాల కంటే ముందుంటామనీ అప్పట్లో హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో- ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ.. రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. బంజారాహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. మంద కృష్ణ మాదిగతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మాజీ మంత్రి దామోదర్ రాజనర్సింహ, బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు, పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గకరణను వెంటనే అమలు చేయాలని వాళ్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+