Seethakka: జనంలోనే సీతక్క.. ప్రజలకు భరోసా కల్పిస్తున్న ఎమ్మెల్యే..
ములుగు ఎమ్మెల్యే సీతక్క.. ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. కరోనా సమయంలో అడవి బిడ్డల కోసం కొండడలు, కోనలు ఎక్కారు. వారికి సాయం చేశారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. తాజాగా తన నియోజకవర్గ ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుండగా వారి బాగోగులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రజలకు ధైర్యం చెబుతూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కారు వెళ్లిలేని ప్రాంతంలోకి కూడా సీతక్క వెళ్తున్నారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీతక్క గురువారం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో కలియతిరిగారు. మోకాలి లోతు వరద నీటిలో నడుచుకుంటూ బాధితులను కలిశారు. నేనున్నాంటూ భరోసానిచ్చారు. సీతక్క మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రజలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా వరదలు వచ్చాయి. వరదల్లో 9 మంది గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.

ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో గురువారం వరదలో గల్లంతైన ఎనిమిది మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం గల్లంతైన వ్యక్తులలో నాలుగు మృతదేహాలు లభించగా మధ్యాహ్నం వరకు మరో నాలుగు మృతదేహాలు లభించినట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లాలో తొమ్మిది మంది వరదలో గల్లంతై మృతి చెందారు.












Click it and Unblock the Notifications