మునుగోడులో ఊరికో ఎస్సై.. మండలానికో డీసీపీ.. అడుగడుగునా నిఘా.. అయినా ఉత్కంఠ!!

మునుగోడు ఉప ఎన్నికల పోరు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకమైన ఎన్నిక కావడంతో జాతీయ పార్టీల దృష్టి కూడా మునుగోడు ఉప ఎన్నికపై ఉంది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల అధికారులకు, పోలీసులకు కత్తిమీద సాముగా తయారైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి మునుగోడు ఉప ఎన్నిక పై ఉండటంతో, ఏ చిన్న సంఘటన జరిగినా అది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. దీంతో మునుగోడు ఉప ఎన్నికపై ఎన్నికల అధికారులు, పోలీసులు ప్రత్యేకమైన నిఘా పెట్టి పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.

 మునుగోడులో పకడ్బందీ ప్లాన్ తో రంగంలో పోలీసులు

మునుగోడులో పకడ్బందీ ప్లాన్ తో రంగంలో పోలీసులు

మునుగోడు ఉప ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లాలో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఊరికి ఒక ఎస్సై, మండలానికి ఒక డిసిపి మునుగోడులో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర పోలీసు బలగాలు సైతం మోహరించి మునుగోడు ఉప ఎన్నికను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాయి. పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న పోలీసుశాఖ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పోలీసులకు విధులను నిర్దేశించింది.

 విధుల్లో మండలానికో డిసిపి.. ఊరికో ఎస్ ఐ

విధుల్లో మండలానికో డిసిపి.. ఊరికో ఎస్ ఐ

ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసులు విధులను నిర్వహిస్తున్నారు. గ్రామానికి ఒక ఎస్సై, మండలానికి ఒక డిసిపి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ, తదనుగుణంగా శాంతియుతంగా ఉపఎన్నిక జరగడానికి ప్రయత్నిస్తున్నారు . ఒక్క చౌటుప్పల్ మండలానికి ఒక డిసిపి, ఇద్దరు ఏసిపిలు, 12 మంది సిఐలు ,ఎస్ఐలు, ఏ ఎస్ఐలు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు కలిపి 400 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. సంస్థాన్ నారాయణ పురంలో ౩౦౦మంది విధుల్లో ఉన్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే అక్కడ అదనంగా బలగాలను మోహరిస్తున్నారు.

అడుగడుగునా పోలీసుల నిఘా మధ్య మునుగోడు ఉపఎన్నిక

అడుగడుగునా పోలీసుల నిఘా మధ్య మునుగోడు ఉపఎన్నిక

మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలలోనూ అడుగడుగునా పోలీసుల నిఘా కొనసాగుతుంది. వేలాదిగా రాష్ట్ర, కేంద్ర బలగాలు మునుగోడు ఉప ఎన్నిక సజావుగా జరగడానికి పహారా కాస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాలలో 48 సున్నిత గ్రామాలను, 104 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన పోలీసులు ఆయా ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

సున్నితమైన గ్రామాలను, సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి మరింత నిఘా

సున్నితమైన గ్రామాలను, సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి మరింత నిఘా

మండలాల వారీగా సున్నితమైన గ్రామాలను గుర్తించి అక్కడ మరింత ఎక్కువ నిఘాను పెంచారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా, ఉప ఎన్నికలలో ప్రలోభాలకు గురి చేయకుండా తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మునుగోడులో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల పనితీరును, స్థానికంగా ఉన్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు సీపీ మహేష్ భగవత్ పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నికకు, ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీల నాయకులు ఎంత మంది అయితే రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారో .. వారికి తగ్గట్టుగా మునుగోడులో పోలీసులు కూడా అంతే స్థాయిలో మోహరించి ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+