మునుగోడులో ఈటల రాజేందర్, రఘునందన్ రావుకు రేవంత్ రెడ్డి సవాల్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వార్నింగ్!!
మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ఇక మునుగోడులో ప్రచారంలో వెనుకబడిన కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని నారాయణపురం, పుట్టపాక గ్రామాలలో ఎన్ని కల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీని, బిజెపిని టార్గెట్ చేశారు.

మునుగోడు దెబ్బ చూపిస్తాం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి వార్నింగ్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అంటూ మండిపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తే భయపడబోమని మునుగోడు దెబ్బ చూపిస్తామని టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని మంత్రి కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉంది అని పేర్కొన్న రేవంత్ రెడ్డి నిన్ను, నీ అయ్యను, మీ బావను అధికారంలోకి తీసుకు వచ్చింది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేయడం కోసమని కేటీఆర్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

కేటీఆర్ మునుగోడు దత్తత వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
దత్తత పేరుతో మంత్రి కేటీఆర్ మునుగోడు ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు. మునుగోడు ప్రజలు వారిని మోసం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి, బిజెపికి బుద్ధి చెప్పాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి గెలిపించాలని కోరారు. మునుగోడు లో టిఆర్ఎస్ గెలిచినా, బిజెపి గెలిచినా ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని పేర్కొన్న రేవంత్ రెడ్డి, బిజెపి నేతలు గెలిచిన ప్రాంతాలలో ఏం అభివృద్ధి చేశారో చూపించాలి అంటూ సవాల్ చేశారు.

ఈటల రాజేందర్, రఘునందన్ రావులకు రేవంత్ రెడ్డి సవాల్
ఈటల రాజేందర్ గెలిచిన హుజరాబాద్ నియోజకవర్గంలోనూ, రఘునందన్ రావు గెలిచిన దుబ్బాక లోనూ ఏమి అభివృద్ధి జరిగిందో చూపాలని ప్రశ్నించారు. తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోలేని నేతలు ఇక్కడికి వచ్చి బిజెపిని గెలిపిస్తే మునుగోడు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం సిగ్గుచేటని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్న రేవంత్ రెడ్డి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేకపోయారు అంటూ ప్రశ్నించారు.

ప్రజలు టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి
మునుగోడులో ఓటర్లను ప్రలోభాలకు గురి చెయ్యటం కోసం టీఆర్ఎస్, బీజేపీలు డబ్బులను, మద్యాన్ని నమ్ముకున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్ముకుంది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గ ఓటర్లు ఎన్నికల కోసం మోసపు హామీలు ఇస్తున్న టిఆర్ఎస్, బిజెపి నాయకులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలన్నారు.
-
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications