వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో ప్రలోభాలు పీక్స్.. పోస్టల్ బ్యాలెట్ లను కూడా వదిలిపెట్టని రాజకీయ పార్టీలు

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉప ఎన్నికలో పోలింగ్ కు సమయం దగ్గర పడటంతో ప్రలోభాల పర్వం పీక్స్ కు చేరింది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు తమకు కేటాయించిన పరిధిలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మునుగోడులో ఓటుకు 40000, లేదా తులం బంగారం ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను తీసుకురావడానికి ఖర్చులు భరించడం తోపాటు, వారికి కూడా ఓటుకు నోటు ఫిక్స్ చేసి రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ఇక ఆన్ లైన్ చెల్లింపులు జోరందుకున్నాయని చర్చ జరుగుతుంది.

పోస్టల్ బ్యాలెట్ లపై రాజకీయ పార్టీల ఫోకస్

పోస్టల్ బ్యాలెట్ లపై రాజకీయ పార్టీల ఫోకస్


ఇదిలా ఉంటే ఇక మద్యం, బిర్యానీ పంపిణీ మునుగోడులో నిత్యకృత్యంగా మారింది. రాజకీయ పార్టీల నాయకులు పోటాపోటీగా డబ్బులు పంచుతున్నట్టు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇక పోస్టల్ బ్యాలెట్ ను వదిలిపెట్టని నాయకులు వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో 128 పోస్టల్ బ్యాలెట్ లు ఉండగా బుధవారం వరకూ 88 నమోదయ్యాయి. ఇక గురువారం నాడు మరో 36 ఓట్లు పోలయ్యాయి.

 పోస్టల్ బ్యాలెట్ లకు భారీగా డబ్బులు

పోస్టల్ బ్యాలెట్ లకు భారీగా డబ్బులు

కొన్ని ఓట్లను ఓ ప్రధాన పార్టీ రెండు వేల నుంచి మూడు వేల రూపాయలకు కొనుగోలు చేయగా, మరో పార్టీ ఐదు వేల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల గడువు సమీపిస్తున్నకొద్దీ పోస్టల్ బ్యాలెట్ లకు ఇచ్చే మొత్తం పెరుగుతున్నట్టు చర్చ జరుగుతుంది. ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున ప్రధాన పార్టీలు డబ్బులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలలో ప్రధానంగా తలపడుతున్న బిజెపి, టిఆర్ఎస్ లు పోటాపోటీగా ఓటర్లను కొనుగోలు చేస్తున్నారని చర్చ జోరుగా సాగుతుంది.

ప్రతీ ఓటు కీలకమే... అందుకే జోరుగా ప్రలోభాల పర్వం

ప్రతీ ఓటు కీలకమే... అందుకే జోరుగా ప్రలోభాల పర్వం


ఇక దీపావళి పండుగ సందర్భంగా కూడా స్వీట్లు, టపాసులు, మద్యం, మాంసం పంపిణీ జోరుగా సాగింది. ఇక నిత్యం మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ లకు పండుగ వాతావరణం ఉంటుంది. విందులు, వినోదాలకు కొదవ లేకుండా చూస్తున్నారు. మొత్తానికి ప్రతి ఓటును కీలకంగా భావిస్తున్న రాజకీయ పార్టీల నాయకులు ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. వోటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

English summary
In the Munugode temptations have reached peaks. Political parties have not abandoned postal ballots and are giving 5 to 10 thousand per vote for postal ballots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X