• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షాతో కేసీఆర్ ఢీ: 50 వేల మెజారిటీ పక్కా: హాట్ హాట్‌గా

|
Google Oneindia TeluguNews

నల్లగొండ: తెలంగాణ రాజకీయాలన్నీప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాట్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక అవసరమైన ఈ నియోజకవర్గాన్ని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నికలో గెలవడానికి అవసరమైన వ్యూహాలను ఇప్పటి నుంచే రూపొందించుకుంటోన్నాయి. దీనితో మునుగోడు హాట్ హాట్‌గా మారింది. ఉప ఎన్నికలో గెలుపెవరిదనేది ఉత్కంఠతగా మారింది.

 21న బీజేపీలోకి..

21న బీజేపీలోకి..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినాయకత్వం వైఖరి, పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి బయటికి వచ్చారు. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనితో ఇక్కడ ఉప ఎన్నికను నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. కోమటిరెడ్డి ఈ నెల 21వ తేదీన బీజేపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటోన్నారు. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా మళ్లీ ఆయనే పోటీ చేయడం ఖాయమైంది.

సెమీఫైనల్స్..

సెమీఫైనల్స్..


వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో- మునుగోడు ఉప ఎన్నికను సెమీఫైనల్‌గా భావిస్తోన్నాయి ప్రధాన పార్టీలన్నీ. తన స్థానాన్ని తాను నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా శనివారం ఆయన మునుగోడులో పాదయాత్ర నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికీ వెళ్లనున్నారు. ప్రతి గ్రామాన్నీ పలకరించనున్నారు. బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు.

Recommended Video

ఆనంద్ మహీంద్ర ప్రశ్న? కేసీఆరేనంటూ మనవడు హిమాన్షు ట్వీట్ *National | Telugu OneIndia
కాంగ్రెస్ పాదయాత్ర..

కాంగ్రెస్ పాదయాత్ర..

అన్నింటికంటే కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. తన కంచుకోటను పోగొట్టుకుంటే- దాని ప్రభావం 2023 నాటి అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా పడుతుందని అంచనా వేస్తోంది. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంది. పాదయాత్రతో దీన్ని అమలు చేయనుంది. మునుగోడుపై ఉన్న పట్టును నిరూపించుకునే పనిలో పడింది.

పోయిన ప్రతిష్ఠ కోసం..

పోయిన ప్రతిష్ఠ కోసం..


ఈ నియోజకవర్గాన్ని దక్కించుకోవడానికి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ హోరాహోరిగా పోరు సాగించనున్నాయి. నాగార్జున సాగర్ మినహాయిస్తే- ఇదివరకు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోయిన ప్రతిష్ఠను తిరిగిపొందడానికి మునుగోడు ఉప ఎన్నిక సరైన వేదికగా భావిస్తోంది. అధికారంలో ఉండీ మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడం తలవంపు అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది టీఆర్ఎస్.

19న బహిరంగ సభ..

19న బహిరంగ సభ..


ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఈ నెల 21వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక సందర్భంగా బీజేపీ మునుగోడులోనే సభను ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అంతకంటే ఒక్కరోజు ముందే తన సత్తాను నిరూపించుకునేలా బహిరంగ సభ కోసం సమాయాత్తమౌతోంది టీఆర్ఎస్.

50 వేలు టార్గెట్..

50 వేలు టార్గెట్..

మంత్రివర్గ సమావేశానికి ముందే కేసీఆర్ నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో భేటీ అయ్యారు. 50 వేల మెజారిటీతో గెలిచి తీరాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. మునుగోడు స్థితిగతులను స్వయంగా ఆయన ఆరా తీస్తోన్నారు. మంత్రులకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని ఇన్‌ఛార్జ్‌గా నియమించేలా చర్యలు తీసుకున్నారు.

English summary
Ahead of bypoll in Munugode in Nalgonda district of Telangana, Ruling party TRS to hold public meeting likely on August 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X