ఇక పని మొదలెట్టండి: కేసీఆర్‌ను కలిసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సత్కారం
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సోమవారం రాత్రి ప్రగతిభవన్‌లో కలిశారు.
మునుగోడు ఉపఎన్నికలో తనకు అవకాశం ఇచ్చి గెలిపించినందుకు సీఎంకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కృతజ్జతలు తెలిపారు. కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్.. శాలువాతో సత్కరించారు.

టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసినందుకు పార్టీ నేతలను అభినందించారు సీఎం కేసీఆర్. సీఎంను కలిసినవారిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణ మొదలు పెట్టాలని పార్టీ నేతలకు సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలను సిద్దం చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డికి సూచించారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.#MunugodeWithTRS pic.twitter.com/4ECGNDoSCk
— TRS Party (@trspartyonline) November 7, 2022
మునుగోడు ఉపఎన్నిక టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ ఉత్కంఠగా సాగింది. అయిదే, చివరకు 10వేల ఓట్ల మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.












Click it and Unblock the Notifications