వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడు విజయం జోష్.. కేసీఆర్ దూకుడు: బీఆర్ఎస్ తో ఏపీతో పాటు 100స్థానాలపై గురి!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకున్నట్టు జరుగుతుందా? దేశంలో టిఆర్ఎస్ పార్టీ పట్టు సాధించడానికి మునుగోడు ఉప ఎన్నిక విజయం బాటలు వేసిందా? మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారా? వచ్చే లోక్సభ ఎన్నికల్లో వంద స్థానాలను కైవసం చేసుకోవడానికి, బీజేపీతో గట్టిగా తలపడటానికి ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? జాతీయ పార్టీగా అవతరిస్తున్న క్రమంలో భాగంగా పక్క రాష్ట్రమైన ఏపీ పైన కూడా కెసిఆర్ ఫోకస్ పెట్టారా అంటే అవును అనే సమాధానమే వస్తుంది.

మునుగోడు ఫలితాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పై కేసీఆర్ ఫోకస్

మునుగోడు ఫలితాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పై కేసీఆర్ ఫోకస్


తెలంగాణ సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక ఫలితాల తర్వాత బిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్పు పై టిఆర్ఎస్ రిపబ్లిక్ నోటీసు ఇచ్చింది. టిఆర్ఎస్ పార్టీ పేరు మార్పు పై బహిరంగ ప్రకటన విడుదల చేసి ఎవరికైనా బిఆర్ఎస్ పార్టీ పేరు పై అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లో సెక్రెటరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వాచన్ సదన్, అశోకా రోడ్, న్యూఢిల్లీ అడ్రస్ కు కారణాలతో సహా అభ్యంతరాలను పంపాలని పబ్లిక్ నోటీసులో పేర్కొంది. దీంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.

గుజరాత్ ఎన్నికలపై కేసీఆర్ నజర్.. గుజరాత్ కు టీఆర్ఎస్ టీమ్

గుజరాత్ ఎన్నికలపై కేసీఆర్ నజర్.. గుజరాత్ కు టీఆర్ఎస్ టీమ్


ఇక ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తో గట్టిగా తలపడటానికి సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందుకోసం గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులను రంగంలోకి దించే ఆలోచనలో సీఎం కేసీఆర్ వున్నారని తెలుస్తుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన చేస్తున్న కెసిఆర్ ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ నేతల బృందాన్ని గుజరాత్ పంపించినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో అక్కడి పరిస్థితులను అంచనా వేసుకుని, బలమైన అభ్యర్థులు ఉన్న పెద్ద స్థానాల్లో కాకుండా, గట్టిపోటీ ఉండని చిన్న స్థానాలను ఎందుకని ఎన్నికల బరిలోకి దిగాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికల్లో 100 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ... ఏపీ పైనా కేసీఆర్ మాస్టర్ ప్లాన్

లోక్ సభ ఎన్నికల్లో 100 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ... ఏపీ పైనా కేసీఆర్ మాస్టర్ ప్లాన్


వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ 100 స్థానాలను టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్న గులాబీ బాస్ ఇప్పటి నుంచే అందుకు వ్యూహాలను రచిస్తున్నారని సమాచారం. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడం భారీ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ముఖ్యంగా ఆయన తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాలను ఎంచుకుని, చిన్న పార్లమెంట్ నియోజకవర్గాలను ఎంచుకుని ఎన్నికల రంగంలోకి దిగాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కూడా కెసిఆర్ ఫోకస్ పెట్టనున్నట్టు నేతలలో చర్చ జరుగుతుంది.

డిసెంబర్ 7 తర్వాత కేసీఆర్ కీలక నిర్ణయాలు

డిసెంబర్ 7 తర్వాత కేసీఆర్ కీలక నిర్ణయాలు

డిసెంబరు 7 వ తేదీన బిఆర్ఎస్ పేరు అధికారికంగా ఖరారైన తర్వాత సీఎం కేసీఆర్ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఆయా రాష్ట్రాలలో స్థానికంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, టిఆర్ఎస్ ఏర్పాటు జరిగిన తరువాత వ్యూహాత్మకంగా ఆయన దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారని సమాచారం. మొత్తానికి మునుగోడు విజయం తర్వాత మళ్ళీ కెసిఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీ పై, బీజేపీ తో ఢీ కొట్టే విధానం పై రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఎన్నికలేవైనా ప్రజలు కేసీఆర్ వెంటేనన్న ఎమ్మెల్సీ కవిత, దొంగప్రమాణాలు చేసినందుకు ఫలితమన్న మంత్రి సత్యవతిఎన్నికలేవైనా ప్రజలు కేసీఆర్ వెంటేనన్న ఎమ్మెల్సీ కవిత, దొంగప్రమాణాలు చేసినందుకు ఫలితమన్న మంత్రి సత్యవతి

English summary
It is reported that KCR, who was in a josh state of success in munugode, is targeting 100 seats with BRS. It is known that he has also focused on the Gujarat elections and has sent a TRS team to Gujarat. KCR also aimed andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X