Munugodu By Election: నామినేషన్ వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
మునుగోడులో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. సోమవారం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. మునుగోడు క్యాంప్ కార్యాలయం నుంచి చండూర్ ఎమ్మార్వో కార్యాలయం వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లిన రాజగోపాల్ రెడ్డి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు.
కదిలొచ్చిన బీజేపీ నేతలు
నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ మునుగోడు స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ గోపాల్ రెడ్డి మాట్లాడారు.

ప్రజల కోసమే రాజీనామా
మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేసినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు ప్రజలు న్యాయం వైపే ఉంటారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలనేవి రాష్ట్ర, దేశ భవిష్యత్తుని నిర్ణయించేవని చెప్పారు. మునుగోడు ప్రజలు ధర్మం వైపు నిలబడతారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా డబ్బుల సంచులతో ప్రజల్లో తిరుగుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications