ఉన్నట్టుండి అరేబియా సముద్రంపై పాకిస్తాన్ బోయింగ్ కార్గో ఫ్లైట్ మిస్సింగ్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి పాకిస్థాన్‌కు బయలుదేరి వస్తోన్న ఓ భారీ కార్గో విమానం అదృశ్యమైంది. మంగళవారం రాత్రి కరాచీ సమీపంలోని అరేబియా సముద్రం గగనతలపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విమానంలో మొత్తం అయిదుగురు సిబ్బంది ఉన్నారు. గాల్లో ఉండగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో కనెక్టివిటీ కోల్పోయింది. దీంతో పాకిస్తాన్ హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టింది. నౌకాదళాలు అరేబియా సముద్రంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలను ప్రారంభించాయి.

యూఏఈ షార్జా నుండి కరాచీకి రావాల్సిన బోయింగ్ 737 కార్గో విమానం ఇది. కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. కరాచీ పోర్ట్ సమీపానికి రాగానే అదృశ్యం అయింది. హఠాత్తుగా రాడార్ పరిధి నుంచి గల్లంతయింది. రాత్రి 9:18 నిమిషాల సమయంలో విమానంలోని నావిగేషన్ వ్యవస్థ హఠాత్తుగా పనిచేయడం ఆగిపోయినట్లు పైలట్లు కంట్రోల్ రూమ్‌కు అత్యవసర సమాచారం అందించారు. ఆ తర్వాత మూడు నిమిషాల వ్యవధిలోనే రేడియో సిగ్నల్స్, వైర్‌లెస్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

Boeing 737 Cargo Flight of Pakistan From Sharjah Missing Over Arabian Sea Multiple Navy Air Deployed

రాడార్ డేటా ప్రకారం.. రాత్రి 9:21 నిమిషాల సమయంలో విమాన వేగా హఠాత్తుగా పెరిగింది. ల్యాండ్ కావడానికి అవసరమైన దాని కంటే రెట్టింపు వేగానికి చేరుకుంది. అదే వేగంతో అరేబియా సముద్రం గగనతలంపైకి దూసుకెళ్లింది. కరాచీ ఎయిర్ పోర్ట్ కు పశ్చిమ దిశగా సుమారు 287 కిలోమీటర్ల తర్వాత ఈ విమానం డేటా సైతం లభించలేదు. విమానం అదృశ్యమైనట్లు వార్త వెలువడగానే పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ చర్యలు చేపట్టింది. అరేబియా సముద్రంలో గాలింపు చర్యల కోసం అత్యవసర రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌ను ప్రారంభించింది.

పాకిస్తాన్ పై తిరుగులేని ఆధారాలు సేకరించిన కేంద్రం
పాకిస్తాన్ పై తిరుగులేని ఆధారాలు సేకరించిన కేంద్రం

పాక్ నౌకాదళానికి చెందిన అత్యాధునిక యుద్ధనౌక పీఎన్ఎస్ జుల్ఫికర్ సహా వైమానిక దళ ప్రత్యేక విమానాలు ఈ శోధన ప్రక్రియలో పాల్గొంటున్నాయి. అలాగే.. టర్బాట్ భూభాగం నుండి బయలుదేరిన నావికాదళ ఏటీఆర్ విమానం కూడా సముద్ర ఉపరితల తీరప్రాంతాలను అనుక్షణం గ్రౌండ్ లొకేట్ చేస్తోంది. కరాచీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ రవాణా విమానయాన సంస్థ కే2 ఎయిర్‌వేస్ కు చెందిన 737 ఫ్లైట్ ఇది. ఈ సంస్థ 2018 మే లో ప్రారంభమైంది.

విమానం వేగం హఠాత్తుగా పెరగడంపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇంజిన్ పూర్తిగా విఫలమైనప్పటికీ, సాధారణంగా ఇలాంటి విమానాలు గాల్లో కొంత దూరం గ్లైడింగ్ చేస్తూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లగలవని విమాన నిపుణుడు ఇమ్రాన్ అస్లాం మీడియాకు వివరించారు. ఈ ఘటనలో మాత్రం అతి తక్కువ సమయంలో విమానం హఠాత్తుగా వేగం పుంజుకోవడం, వెనక నావిగేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడమే కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+