ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన కూతురు.. ఇంట్లోనే పూడ్చివేత !!

కన్నప్రేమను మించిన శక్తి లోకంలో మరొకటి లేదంటారు. కానీ, అదే కన్నప్రేమ ఒక కూతురి కళ్లకు అడ్డుగా అనిపించింది. తన ఎదుగుదలకు, సుఖానికి అండగా నిలిచిన తల్లి ప్రాణాలనే తీసేలా చేసింది. గతేడాది మే నెలలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ పరిధిలో జరిగిన ఈ ఘోరం, తాజాగా వెలుగులోకి వచ్చి సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది.

నమ్మకానికి వెన్నుపోటు..

ఝార్ఖండ్‌కు చెందిన అంజు (45), భర్త దూరమైనా సరే ఇళ్లల్లో పనులు చేస్తూ తన ఇద్దరు కుమార్తెలను ఎంతో గారాబంగా పెంచింది. కానీ, ఇంటర్ చదువుతున్న చిన్న కూతురు (17) డ్రైవర్‌గా పనిచేసే మోంటీ కుమార్‌సింగ్‌ (22) మాయలో పడింది. తన కూతురి భవిష్యత్తు నాశనమైపోతుందని భయపడిన ఆ తల్లి, మోంటీని హెచ్చరించింది. తన కూతురిని రక్షించుకోవడానికి రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసి అతడిని జైలుకు కూడా పంపింది.

murder-case-about-minor-daughter-killed-mother-with-the-help-of-lover-and-buried-at-home

అయితే వారిద్దరూ మారకపోగా.. తమ ప్రేమకు అడ్డు రావడంతో బాలిక, మోంటీతో కలిసి అంజును హత్య చేయాలని పథకం పన్నింది. గతేడాది మే 12న బాలిక, మోంటీ కలిసి అంజును కత్తితో పదేపదే పొడిచి చంపారు. అప్పుడు ఆమె వయసు 17 సంవత్సరాలు. మృతదేహాన్ని గదిలో మంచం కింద దాచి, ఫోన్‌ను ధ్వంసం చేశారు. సాయంత్రం ఇంటికొచ్చిన పెద్ద కుమార్తె రోషిణి 'అమ్మ ఎక్కడికి వెళ్లిందని' అడగ్గా, పని ఉందని బైక్‌పై వెళ్లిందని, ఫోన్ స్విచ్ఛాఫ్ అని బాలిక అబద్ధం చెప్పింది.

ఆ రాత్రి మృతదేహం దాచిన గదిలోనే మోంటీ, బాలిక ఉన్నారు. రోషిణి ఉద్యోగానికి వెళ్లిన మరుసటి రోజు, బాలిక మోంటీతో కలిసి అంజు మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. తల్లి బైక్‌ను కూడా దాచారు. సాయంత్రం తిరిగి వచ్చిన రోషిణి, సిమెంటు ఎందుకు వేశారని అడగ్గా, ఎలుకల బెడద వల్ల అని అబద్ధం చెప్పారు.

ఈలోగా తల్లికి రావాల్సిన చిట్టీ డబ్బులు ₹83,000 గురించి బాలిక రోషిణికి తెలిపింది. చిట్టీ నిర్వాహకుడు FIR చూపిస్తేనే డబ్బు ఇస్తాననడంతో, రోషిణి 2025 అక్టోబరు 12న జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ద్విచక్రవాహనంపై వెళ్లి అదృశ్యమైనట్లు అందులో పేర్కొంది.

ఇక ఈ ఏడాది జనవరిలో బాలిక యాదగిరిగుట్టలో మోంటీని పెళ్లాడింది. ఇటీవల వారికి డబ్బు అవసరమవడంతో, దాచిపెట్టిన అంజు ద్విచక్రవాహనాన్ని ఒకరికి ₹35,000కు అమ్మెశారు. వాహనం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో, అది అంజు పేరు మీద ఉండటం, దానిపై FIR నమోదై ఉండటం కొనుగోలుదారుకు తెలిసింది. అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

కొనుగోలుదారుడి సమాచారంతో ఇన్‌స్పెక్టర్‌ సైదులు మోంటీని స్టేషన్‌కు పిలిచి ప్రశ్నించారు. అంజు వాహనం అతని వద్దకు ఎలా వచ్చిందని గట్టిగా నిలదీయగా, మోంటీ అసలు విషయం బయటపెట్టి, హత్యను అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని, బాలికను అమీర్‌పేటలోని స్టేట్‌ హోంకు, మోంటీని జైలుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+