Telangana Assembly Elections 2023: ఎన్నికల్లో కీలకంగా మారనున్న ఆ ఓటర్లు..!

తెలంగాణలో అత్యధికంగా బీసీ ఓటర్లు ఉంటారు. ఆ తర్వాత ఎస్సీ ఓటర్లు ఉంటారు. అయితే వీరంతా ఒక్కదాటిపైకి రావడం కష్టం. కానీ రాష్ట్రంలోని ముస్లింలు మాత్రం ఒకే నిర్ణయం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో ఇది నిరూపితమైంది కూడా. సో ఈసారి కూడా తెలంగాణలో ముస్లిం ఓటర్ల కీలకంగా ఉండనున్నారు. రాబోయే ఎన్నిక(Telangana Assembly Elections 2023:)ల్లో వారు ఎవరిని ఆదరిస్తారో వారే అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో సుమారు 14 శాతం ఉన్న ముస్లింలు ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ముస్లిం ఓటర్లకు సంబంధించి పీపుల్స్ పల్స్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ ఎన్నికల్లో ముస్లింలు స్థానిక పరిస్థితులతో పాటు రాష్ట్ర రాజకీయాలను కూడా ఆలోచించి ఓటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామనే ఎంఐఎం పాతబస్తీకే పరితమైంది. అయినప్పటికీ ఆ పార్టీ ప్రభావం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో 50 నియోజకవర్గాల్లో గెలుపోటములు శాసించే స్థాయిలో మూస్లింలు ఉన్నారు. పాతబస్తీ మినహాయిస్తే మిగాత ప్రాంతాల్లోని కొన్ని చోట్లు వారు కీలకం కానున్నారు.

Muslim voters will be crucial in Telangana assembly elections 2023

13 చోట్ల 20 శాతానికి పైగా, 11 స్థానాల్లో 15--20 శాతం, 28 సీట్లలో 10--15 శాతం ఓట్లతో ముస్లింలు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. 2014, 2018లో బీఆర్ఎస్ కు మొగ్గు చూపిన ముస్లింలు ఈసారి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీపై పోరాటం చేస్తుండడంతో పాటు బీఆర్ఎస్ అవసరం ఉంటే బీజేపీతో కలిసే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ ఆయుధంగా మార్చుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

అయినప్పటికీ ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడనుకుంటే వారికి.. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారంటే వారికి ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు అధ్యయనంలో వెల్లడయింది. ఇక లోక్ సభ స్థానాల గురించి తెలుసుకుంటే.. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్లు అధ్యయనం పేర్కొంది. పీపుల్స్‌‌‌‌పల్స్‌‌‌‌ క్షేత్రస్థాయి అధ్యయనంలో ఆయా నియోజకవర్గాల్లో ముస్లింలు స్థానిక సమస్యల కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో బలపడకుండా ఉండడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసింది.

ఎంఐఎం నేత అసదుద్దీన్‌‌‌‌ ఓవైసీ ఎవరికి చెబితే వారికే ఓట్లేస్తారనేది కూడా ఒక భ్రమేనని తేలింది. కేసీఆర్‌‌‌‌కు ఎంఐఎం బహిరంగంగా మద్దతిస్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు గంపగుత్తగా ఓట్లేస్తారని గ్యారెంటీ లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ ముస్లింలను ఆకట్టుకునేందుకు వారి సంక్షేమం కోసం సబ్‌‌‌‌ప్లాన్‌‌‌‌ కింద నాలుగు వేల కోట్ల బడ్జెట్‌‌‌‌తో మైనార్టీ డిక్లరేషన్‌‌‌‌ను‌‌ ప్రకటించింది. మైనార్టీ జంటలకు రూ.1,60,000 ఆర్థిక సాయం, అబ్దుల్‌‌‌‌ కలాం తోఫా కింద విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల సాయం, ఇమామ్‌‌‌‌లకు12 వేల గౌరవ వేతనం వంటి ఆకర్షణీయమైన హామీలు ఇచ్చింది. మరోవైపు కాంగ్రెస్‌‌‌‌ ఆరు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను దింపింది. వీటిలో చార్మినార్‌‌‌‌, కార్వాన్‌‌‌‌, మలక్‌‌‌‌పేట్‌‌‌ కష్టంగా ఉన్నా.. నిజామాబాద్‌‌‌‌ అర్బన్‌‌‌‌, జూబ్లీహిల్స్, నాంపల్లి నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+