రేవంత్ రెడ్డికి మైహోం రామేశ్వర రావు షాక్: రూ.90 కోట్ల పరువునష్టం దావా
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు అయింది. మైహోం గ్రూప్ అధినేత రామేశ్వర రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు అయింది. మైహోం గ్రూప్ అధినేత రామేశ్వర రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం నాడు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా రామేశ్వర రావు స్టేట్‌మెంటును రికార్డు చేసిన కోర్టు... ఈ అంశంపై తగిన సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువు అయిన రామేశ్వర రావుకు హైదరాబాదులో భూములు కేటాయించడంపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. రేవంత్ తన పైన చేసిన ఆరోపణల వల్ల పరువు నష్టం వాటిల్లిందని, అందుకు రేవంత్ తనకు రూ.90 కోట్లు చెల్లించాలని లీగల్ నోటీసులు పంపించారు.












Click it and Unblock the Notifications