Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిడ్డా మైనంపల్లి-పిచ్చి కుక్కలా అరుస్తున్నావ్-సంజయ్ మన్యం పులి-మర్డర్లు,సెటిల్‌మెంట్లే నీ సోషల్ సర్వీసెస్

మల్కాజ్‌గిరిలో టీఆర్ఎస్,బీజేపీ శ్రేణుల మధ్య ఫైట్ ముదురుతోంది. నిన్న మల్కాజ్‌గిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్ద ఇరు పార్టీలు ఘర్షణ పడగా... ఇవాళ సీన్ నేరెడ్‌మెట్‌కు మారింది. నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ ఎదుట టీఆర్ఎస్,బీజేపీ కార్యకర్తలు గొడవపడ్డారు. ఈ క్రమంలో మౌలాలి బీజేపీ కార్పోరేటర్ సునీతా యాదవ్ కారు ధ్వంసమైంది. టీఆర్ఎస్ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌-ఎమ్మెల్యే మైనంపల్లి మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం నేపథ్యంలో... బీజేపీ సోమవారం(ఆగస్టు 16) స్థానికంగా బంద్‌కు పిలుపునివ్వడంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి మైనంపల్లి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీ బంద్ ఎఫెక్ట్...

బీజేపీ బంద్ ఎఫెక్ట్...

మల్కాజ్‌గిరిలో సోమవారం బంద్‌కు బీజేపీ పిలుపునివ్వగా... ఆ పార్టీ శ్రేణులు స్థానిక షాపులను మూయించారు.బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం,తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. అనంతరం పోలీసుల తీరును నిరసిస్తూ మల్కాజ్‌గిరి వినాయక్ నగర్ చౌరస్తా వద్ద బీజేపీ కార్పోరేటర్లు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

నేరెడ్‌మెట్ పీఎస్ వద్ద ఉద్రిక్తత... కార్పోరేటర్ కారు ధ్వంసం

నేరెడ్‌మెట్ పీఎస్ వద్ద ఉద్రిక్తత... కార్పోరేటర్ కారు ధ్వంసం

ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను నేరెడ్‌మెట్ పీఎస్‌కు తరలించడంతో బీజేపీ శ్రేణులు అక్కడికి భారీ ఎ్తతున చేరుకున్నారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు,టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగ అక్కడికి వచ్చారు. దీంతో బీజేపీ శ్రేణులు మైనంపల్లికి,టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు టీఆర్ఎస్ శ్రేణులు కూడా బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం,ఘర్షణ చోటు చేసుకున్నాయి. మౌలాలి బీజేపీ కార్పోరేటర్ సునీతా యాదవ్ కారు ధ్వంసమైంది. టీఆర్ఎస్ కార్యకర్తలే రాళ్లతో కారుపై దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.

వివాదం ఎక్కడ మొదలైంది...

వివాదం ఎక్కడ మొదలైంది...

మల్కాజ్‌గిరిలో ఆదివారం(ఆగస్టు 15) జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భరతమాత ఫోటోపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ శ్రేణులకు,బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం,ఘర్షణ చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కార్పోరేటర్ శ్రవణ్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రిలో చేరిన శ్రవణ్‌ను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సంజయ్... మైనంపల్లిపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. దీంతో మైనంపల్లి అంతకన్నా రెట్టింపు స్వరంతో బండి సంజయ్‌ని పరుష పదజాలంతో దూషించారు. దీంతో ఇరు పార్టీల మధ్య గొడవ మరింత ముదిరింది. ఇప్పటికే మైనంపల్లి,ఆయన తనయుడిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా బీజేపీ మౌలాలి కార్పోరేటర్ సునీతా యాదవ్ ఫిర్యాదుతో మైనంపల్లి,ఆయన తనయుడు రోహిత్ సహా కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలపై నేరెడ్‌మెట్‌ పీఎస్‌లోనూ కేసులు నమోదయ్యాయి.

మైనంపల్లి పిచ్చి కుక్కలా అరుస్తున్నారు : రాకేష్ రెడ్డి

మైనంపల్లి పిచ్చి కుక్కలా అరుస్తున్నారు : రాకేష్ రెడ్డి

బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.అహంకారం,అధికార మదం తలకెక్కి మైనంపల్లి పిచ్చి కుక్కలా అరుస్తున్నారని విమర్శించారు. కల్లు తాగిన కోతిలా... మంత్రివర్గంలో స్థానం రాలేదనే అసహనంలో.. మైనంపల్లి ఇలాంటి భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. మైనంపల్లి వాడిన భాషతో ఆయన రౌడీ అని చెప్పకనే చెప్పారన్నారు.బండి సంజయ్‌కి ప్రజాబలం లేదని మాట్లాడటం అర్థరహితమన్నారు.ప్రజా బలం ఉంది కాబట్టే మూడుసార్లు కార్పోరేటర్‌గా,ఒకసారి ఎంపీగా ఎలా గెలిచారని చెప్పారు.బండి సంజయ్ బీసీ నాయకుడు అనే ఉద్దేశంతోనే మైనంపల్లి ఆయనపై రెచ్చిపోయి మాట్లాడారని ఆరోపించారు. మైనంపల్లి భాష,ఆయన వ్యవహారాన్ని టీఆర్ఎస్ సమర్థిస్తోందా అని ప్రశ్నించారు.కార్పోరేటర్‌పై దాడికి,దళిత మహిళలపై దాడికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.

బండి సంజయ్ మన్యం పులి : రాకేష్ రెడ్డి

బండి సంజయ్ మన్యం పులి : రాకేష్ రెడ్డి


మైనంపల్లి ఇంటి వద్ద నిరసన చేయడానికి వెళ్లిన మహిళలపై దాడి చేశారని రాకేష్ రెడ్డి ఆరోపించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండాను,మహాత్మా గాంధీని,బాబా సాహెబ్ అంబేడ్కర్‌‌లను అవమానించారని ఆరోపించారు.మైనంపల్లి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని... ఇంత జరిగినా కేసీఆర్,కేటీఆర్ స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు,ప్రతి విమర్శలు సహజమని... బెదిరింపులు,గూండాయిజానికి స్థానం లేదని అన్నారు. బిడ్డా.. నువ్వు మైనంపల్లి అయితే మా రాష్ట్ర అధ్యక్షుడు మన్యం పులి అని హెచ్చరించారు.మైనంపల్లితో పాటు టీఆర్ఎస్ అవినీతి,అరాచకాలను తరిమి కొడుతామన్నారు. సంజయ్‌తో పెట్టుకున్నవాళ్లు మట్టికొట్టుకుపోయారని పేర్కొన్నారు. కరీంనగర్‌ వస్తానని మైనంపల్లి సవాల్ చేస్తున్నారని చెప్పిన రాకేష్ రెడ్డి... బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే ఆయన బోయిన్‌పల్లి కూడా దాటలేరని అన్నారు.

మైనంపల్లి ఆ దేశాలకు ఎందుకు వెళ్తున్నారు : రాకేష్ రెడ్డి

మైనంపల్లి ఆ దేశాలకు ఎందుకు వెళ్తున్నారు : రాకేష్ రెడ్డి

గతంలో బీజేపీలో చేరేందుకు మైనంపల్లి తమ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడని రాకేష్ రెడ్డి అన్నారు. ఆ విషయం బండి సంజయ్ ఇప్పుడు ప్రస్తావించడంతో... ఎక్కడ కేసీఆర్,కేటీఆర్ తనను ప్రగతి భవన్ గేటు దాటనివ్వరేమోననే టెన్షన్ పట్టుకుందన్నారు. అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మైనంపల్లి భాష ఆయన చిల్లర మనస్తత్వానికి నిదర్శనమన్నారు. మైనంపల్లి చెబుతున్న సోషల్ సర్వీసెస్ అంటే సెటిల్‌మెంట్లా,కబ్జాలా,రౌడీయిజమా అని ప్రశ్నించారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే... మర్డర్స్,సెటిల్‌మెంట్స్,సెల్ఫ్ డబ్బా,ఒర్రడం అని ఎద్దేవా చేశారు.మైనంపల్లి వ్యాఖ్యలు చూశాక మల్కాజ్‌గిరి ప్రజలు ఇలాంటి నేతను ఎన్నుకున్నామా అని ఆవేదన చెందుతున్నారని అన్నారు. గతంలో మైనంపల్లిని నగర బహిష్కరణ చేశారని గుర్తుచేశారు. బండి సంజయ్ నిత్యం ప్రజల్లో ఉంటారని... మైనంపల్లి మాత్రం గోవా,శ్రీలంక,మలేషియా,సింగపూర్‌లకు తిరుగుతుంటారని ఆరోపించారు. ఆ దేశాలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. మైనంపల్లిలా తాము దిగజారి మాట్లాడదలుచుకోలేదన్నారు. ఇకనైనా మైనంపల్లి బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. టీఆర్ఎస్ పార్టీ ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+