వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విక్రమ్‌గౌడ్‌పై కాల్పులు: ఆ తుపాకీ ఎక్కడ, విక్రమ్‌కు నిజనిర్ధారణ పరీక్షలు?

మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రంగౌడ్‌పై కాల్పుల ఘటనలో పోలీసులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్‌గౌడ్‌పై కాల్పులకు ఉపయోగించిన తుపాకీ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రంగౌడ్‌పై కాల్పుల ఘటనలో పోలీసులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్‌గౌడ్‌పై కాల్పులకు ఉపయోగించిన తుపాకీ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అనేక అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.అవసరమైతే విక్రమ్‌గౌడ్‌కు నిజనిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నారు.

విక్రమ్‌గౌడ్ కేసుల ఘటనను పోలీసులను మొదటి నుండి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే విక్రమ్‌గౌడ్ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఒకవేళ అదే జరిగి ఉంటే ఆ వెపన్ ఎక్కడినుండి వచ్చింది, ఆ వెపన్‌ను ఎక్కడ దాచిపెట్టారనే విషయాలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

విక్రమ్‌గౌడ్ ఆయుధం లైసెన్స్ కోసం కూడ ఇటీవలే పోలీసులకు ధరఖాస్తు చేసుకొన్నాడు. అయితే ఈ ధరఖాస్తును పోలీసులు తిరస్కరించారు. అయితే విక్రమ్ వద్ద అధికారికంగా వెపన్ లేదు. అయితే అనధికారికంగా వెపన్ ఉందా? అనే కోణంలో కూడ విచారణ సాగిస్తున్నారు.

విక్రమ్‌గౌడ్ ఆయన భార్య ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ జరిపిన పోలీసులకు మాత్రం సరైన ఆధారాలు లభ్యం కాలేదు. అయితే వారిచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేస్తే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదో విషయాన్ని వారు దాచిపెడుతున్నారనే అనుమానాలను కూడ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని విక్రమ్ సతీమణి షిఫాలీ ఖండించారు.

ఆయుధం ఎక్కడ?

ఆయుధం ఎక్కడ?

విక్రమ్‌గౌడ్‌పై కాల్పులు జరిగాయి.అయితే విక్రమ్‌గౌడ్ ఇంట్లో కూడ రక్తం మరకలను తుడిచివేశారని పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సాక్ష్యాలను తారుమారుచేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడ లేకపోలేదు. అయితే ఈ విషయాలన్నింటిపై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్‌పై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కాల్పులకు ప్రయత్నించారని చెబుతున్నారు. అయితే ఆ ఇంట్లోకి వచ్చి పారిపోవడం సాధ్యం కాదు. ఎత్తైన ప్రహరీగోడ ఉండడంతో తప్పించుకొని పారిపోవడం సాధ్యం కాదనే అభిప్రాయాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు డాగ్‌స్వ్కాడ్ కూడ ఆ ఇంట్లోనే తిరిగి నిలిచిపోయిందని పోలీసులు అంటున్నారు. అయితే దేశవాళీ తుపాకీతో ఈ కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. అసలు ఈ ఆయుధం ఎవరిది, ప్రస్తుతం ఈ ఆయుధం ఎక్కడ ఉందనే విషయమై ఆరా తీస్తున్నారు.

అవసరమైతే విక్రమ్‌కు నిజనిర్ధారణ పరీక్షలు

అవసరమైతే విక్రమ్‌కు నిజనిర్ధారణ పరీక్షలు

విక్రమ్‌గౌడ్ పోలీసులకు చెబుతున్న విషయాలపై పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తనపై ఆగంతకులు కాల్పులు జరిపారని ఆయన పోలీసులకు శనివారం నాడు వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో అలాంటి ఆనవాళ్ళు కన్పించలేదనే అభిప్రాయాలతో ఉన్నారు పోలీసులు. అవసరమైతే విక్రమ్‌గౌడ్‌కు నిజనిర్ధారణ పరీక్షలు నిర్వహించాలనే యోచనలో కూడ ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఘటన స్థలంలో దొరికిన గన్‌షాట్ రెసిడ్యూ స్వాబ్స్ పరీక్షలు పూర్తై నివేదిక వస్తే కానీ, ఈ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.

ఆసుపత్రి సీసీటీవి పుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు

ఆసుపత్రి సీసీటీవి పుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు

ఆసుపత్రిలోని సీసీటీవి పుటేజీని కూడ పోలీసులు పరిశీలిస్తున్నారు. విక్రమ్‌గౌడ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్ళిన సమయంలో ఎవరెవరున్నారు. ఎవరెవరు విక్రమ్‌గౌడ్‌ను కలిశారనే విషయాలపై ఆరాతీస్తున్నారు. వారిలో ఎవరైనా తుపాకీని తీసుకెళ్ళారా, అనే అంశంపై కూడ దృష్టి కేంద్రీకరించారు. శనివారం నాడు విక్రమ్‌గౌడ్ ఇంటి వెనుక వైపున కూడ వెపన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వారికి వెపన్ దొరకలేదు.

ముఖేష్‌గౌడ్ పిస్తోల్ స్వాధీనం

ముఖేష్‌గౌడ్ పిస్తోల్ స్వాధీనం

విక్రమ్‌గౌడ్ కాల్పుల ఘటనలో దొరికిన తూటా, షెల్స్ 7.65 క్యాలిబర్‌కు చెందినవి, వీటిని 32 ఫిస్టల్‌లోనూ కూడ పెట్టి పేల్చే అవకాశం ఉందని బాలిస్టిక్ నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు. విక్రమ్ తండ్రి మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ వద్ద ఉన్న లైసెన్స్‌డ్ ఫిస్ట‌ల్ ఉంది. దీన్ని ముఖేష్‌కు తెలియకుండా విక్రమ్ తెచ్చుకొన్నాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ మేరకు ముఖేష్ వద్ద ఉన్న తుపాకీని ఆయన నుండి స్వాధీనం చేసుకొన్నారు. దీన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. అయితే ఈ తుపాకీని వాడలేదని ప్రాథమిక పరీక్షల తరువాత తేల్చారు అధికారులు. ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇద్దరు కాల్చారు.

ఇద్దరు కాల్చారు.

తాను డ్రాయింగ్ రూమ్‌లో కూర్చొని ఉండగా ఒ హెల్మెట్ పెట్టుకొన్న వ్యక్తి ఒకరు, ముఖానికి కర్చీప్ కట్టుకొన్న వ్యక్తి వచ్చి కాల్చారని విక్రమ్‌గౌడ్ పోలీసులకు చెప్పారు. అయితే రెండు రౌండ్లు తనపై కాల్పులు జరపడంతో తాను అరిచానని , తన భార్య రావడాన్ని చూసి నిందితులు పారిపోయారని విక్రమ్‌గౌడ్ పోలీసులకు చెప్పారు. అయితే ఈ కథనాలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

English summary
In a mysterious incident of firing that took place on Friday morning, Moola Vikram Goud, son of a former minister in the united Andhra Pradesh Mukesh Goud was injured in the upscale Banjara Hills area in Hyderabad. Police suspect that it was more of suicide attempt as Vikram was neck-deep in debts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X