పొలంలోనే అత్యాచారం, కిరోసిన్ పోసి కాల్చివేత, ఎక్కడంటే?

మిరుదొడ్డి: ఇంటర్మీడియట్ చదువుతున్న యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో చోటు చేసుకొంది. తమ వ్యవసాయపొలంలోనే యువతి శవాన్ని అర్ధరాత్రి గుర్తించారు. అత్యాచారం చేసిన ఆనవాళ్ళు ఉన్నట్టు పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఇంటర్మీడియట్ చదువుతున్న 18 ఏళ్ళ బాధిత యువతి తమ స్వంత పొలానికి నీళ్ళు పెట్టేందుకు మార్చి 2వ తేది మధ్యాహ్నం ఒంటరిగా వెళ్ళింది. అయితే సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో యువతి నానమ్మ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

అయితే కుటుంబసభ్యులు పొలం వద్ద వెతికితే రాత్రి పూట బాధితురాలి శవం కన్పించింది. గుర్తు పట్టని విధంగా కిరోసిన్ పోసి తగులబెట్టారు. అత్యాచారం చేసిన తర్వాత విషయం బయటకు పొక్కకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో నిందితులు బాధితురాలిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

అత్యాచారం చేసి హత్య

అత్యాచారం చేసి హత్య

మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన 18 ఏళ్ళ యువతిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మృతురాలికి చెందిన పొలంలోనే అత్యాచారం చేసి హత్య చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి సొంత పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లింది. అయితే శుక్రవారం నాడే బాధితురాలిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలిని వదిలేస్తే తమ పేర్లను బయటకు చెప్పే ప్రమాదం ఉందని భావించి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

పథకం ప్రకారమే హత్య

పథకం ప్రకారమే హత్య

పొలానికి నీరు పెట్టేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్ళిన యువతిని గుర్తించిన దుండగులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. అయితే నిందితుల నుండి తప్పించుకొనేందుకు యువతి తీవ్రంగా ప్రయత్నించిందని పోలీసులు గుర్తించారు. పంట పొలంలో పెనుగులాడినట్టుగా గుర్తులున్నాయి. జొన్నచేనులో పైరు దెబ్బతింది. యువతి గాజులు పగిలిపోయాయి. చెప్పులు వేర్వేరు ప్రాంతంలో పడి ఉన్నాయి. కిరోసిన్ డబ్బాను కూడ పోలీసులు గుర్తించారు. కిరోసిన్ డబ్బాను ఎవరు తీసుకొచ్చారనే విషయమై పోలీసులు కూడ దర్యాప్తు చేస్తున్నారు.

సంఘటన స్థలం వద్ద డాగ్ స్క్వాడ్ తనిఖీలు

సంఘటన స్థలం వద్ద డాగ్ స్క్వాడ్ తనిఖీలు

నిందితులను గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. మృతురాలి తల్లి రెండేళ్ళ క్రితమే టీబీతో చనిపోయింది. మృతురాలి సోదరికి ఏడాది క్రితం వివాహమైంది. అయితే ఈ ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

పోస్ట్ మార్టం కోసం చూస్తున్న పోలీసులు

పోస్ట్ మార్టం కోసం చూస్తున్న పోలీసులు


యువతి హత్య కేసుకు సంబంధించి ఆధారాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.ఈ రిపోర్ట్‌లో యువతి హత్యకు గల కారణాలు శాస్త్రీయంగా తేలే అవకాశం ఉంది. అయితే యువతిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారా, తెలిసినవారే హత్యకు చేశారా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+